
చిత్రం: నాగబంధం
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, అనసూయ, రిషభ్ సావ్నీ తదితరులు
దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి
విడుదల తేదీ: జులై 3, 2026
టాలీవుడ్లో ఇటీవల కాలంలో మైథాలజీ, అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే ‘పెదకాపు’ సినిమాతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో, ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం ‘నాగబంధం’. భారీ ప్రమోషన్స్, టీజర్లతో మంచి హడావుడి సృష్టించిన ఈ సినిమా జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టుకుందో లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
#Nagabandham Review : A Visual Extravaganza with solid BGM – 3/5 💥💥💥
Mainly Hero #ViratKarrna completely nailed the performance 🎭 from start to finish especially last 20 min his acting was superb 👌👌👌
Director #AbhishekNama visuals are top notch mainly #NamoRe song was… pic.twitter.com/wwurindc5J
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) July 2, 2026
Also Read : ‘టైగర్ కా హుకూం’ ఆగయా.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది భయ్యా
సినిమా కథేంటి?
మరణాన్ని జయించి, ప్రపంచాన్ని శాసించాలనే మనుషుల దురాశ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. 1962 కాలంలో ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్ (జగపతిబాబు)కు నాగబంధం రహస్యానికి సంబంధించిన ఒక అంతుచిక్కని పుస్తకం దొరుకుతుంది. దీని ఆధారంగా ఆ బ్రహ్మకమలం ఎక్కడుందో కనిపెడతారు. అయితే అది రంగనాథస్వామి దేవాలయంలో విష్ణువు వద్ద ఉంటుంది. అయితే కొందరు దురాశపరులు దాన్ని దొంగిలించడానికి కుట్ర చేస్తారు.
మరోవైపు, హీరో రుద్ర (విరాట్ కర్ణ)కు తన చెల్లి అంటే ప్రాణం. ఆమె పెళ్లి విషయంలో మేనత్త (అనసూయ) కుటుంబం సమస్యలు సృష్టించినా, చివరకు పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ మేనత్త కొడుకు మాత్రం పగతో రగిలిపోతూ విలన్ అలీ (రిషభ్ సావ్నీ)తో చేతులు కలుపుతాడు. ఆ విలన్ బ్రహ్మకమలం కోసమే వెతుకుతుంటాడు. సరిగ్గా పెళ్లి రోజున విలన్ గ్యాంగ్ పెను విధ్వంసం సృష్టిస్తుంది. రుద్ర కళ్ల ముందే అతని చెల్లిని, తల్లిని, అత్తని చంపేసి బ్రహ్మకమలాన్ని ఎత్తుకెళ్తారు. ఈ క్రమంలోనే రుద్ర ప్రేమించిన పార్వతి (నభా నటేష్) కూడా అతనికి వెన్నుపోటు పొడుస్తుంది. ఆ తర్వాత రుద్ర విలన్లను ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఈ కథకు, అనంత పద్మనాభస్వామి టెంపుల్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగతా సినిమా.
సినిమా ఎలా ఉందంటే?
సినిమాను గ్రాండ్‌గా చూపించడానికి దర్శకుడు అభిషేక్ నామా ప్రయత్నించారు. కథలో మైథాలజీ అంశాలు, అడ్వెంచర్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ, వాటిని స్క్రీన్ మీద చూపించిన విధానం ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉన్నా, కథ ముందుకు సాగుతున్న కొద్దీ ల్యాగ్ అనిపిస్తుంది. ట్విస్టులు, యాక్షన్ సీన్లు అనుకున్న స్థాయిలో పండలేదు. ముఖ్యంగా హీరో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీ ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వవు. విలన్ల క్యారెక్టరైజేషన్ బలంగా లేకపోవడం వల్ల హీరో-విలన్ మధ్య వచ్చే మైండ్ గేమ్స్ అంతగా క్లిక్ కాలేదు. సినిమా విజువల్స్ బాగున్నా.. స్క్రీన్ ప్లే బాలేదు. ముఖ్యంగా సినిమాకు కాస్టింగ్ అసలు సెట్ కాలేదని సినిమా లవర్స్ అంటున్నారు.
నటీనటుల ప్రతిభ
రుద్ర పాత్రలో విరాట్ కర్ణ యాక్షన్ సీన్స్ బాగానే చేశాడు. కానీ ఎమోషనల్ సీన్స్‌లో ఇంకా బాగా యాక్ట్ చేయాల్సిందని అంటున్నారు. హీరోయిన్ నభా నటేష్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కొత్తగా కనిపించడానికి ప్రయత్నించింది. ఐశ్వర్య మీనన్ నటన పర్వాలేదు. జగపతిబాబు ఆర్కియాలజిస్ట్ పాత్రలో తన అనుభవంతో మెప్పించారు. అనసూయ భరద్వాజ్, జగపతిబాబు వంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ వారి పాత్రలు కథను పెద్దగా నిలబెట్టలేకపోయాయి.
సాంకేతిక విభాగాలు
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ విజువల్స్. ప్రొడక్షన్ వాల్యూస్. ఇవి చాలా రిచ్‌గా ఉన్నాయి. గ్రాఫిక్స్ కొన్ని చోట్ల బాగుంటే మరికొన్ని చోట్ల బాగాలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు అసలు సెట్ కాలేదు. కొన్ని సీన్లలో మార్చి కాస్త ఎడిటింగ్ కూడా మంచిగా చేసి ఉంటే బాగుండేదని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌తో రిచ్ విజువల్స్ ఉన్నప్పటికీ.. కథలో బలం లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు.
Also Read : రెమ్యునరేషన్ ఎగ్గొట్టారు.. హైకోర్టులో కేసు వేసిన లేడీ డైరెక్టర్!









