JAILER 2 Release Date
JAILER 2 Release Date

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఓ ఫెస్టివల్ మంత్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఉండటంతో ఆ ఫెస్టివల్ వారంలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తాజాగా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

‘జైలర్’ మూవీతో సూపర్ స్టార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అంచనాలకు మించిన రెస్పాన్స్‌తో ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా జైలర్ 2 మూవీ రాబోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో ఈసారి స్టార్ క్యాస్టింగ్ ఉండబోతుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్‌లాల్ సహా రమ్యకృష్ణ వంటి యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీని ప్రకారం.. ఫస్ట్ పార్ట్‌ కంటే సెంకండ్ పార్ట్‌లోని పాత్రలు మరింత స్ట్రాంగ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.