
హీరో అక్కినేని అఖిల్ చాలా ఏళ్ల తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్. నేడు ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. యంగ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో లవ్ అండ్ ఎమోషనల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను అక్కినేని నాగార్జున, నాగదేవర సూర్యవంశీ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
Also Read : నేను బైసెక్సువల్.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్!
BLOCKBUSTER REPORTS 🔥🔥🔥
Akhil performance improvement
NTR Voiceover 🐅🔥
Hero – Heroine Chemistry
Pre-interval – Pre-Climax – Climax Reports 💥💥💥Finally Hittuuuu bomma boys @AkhilAkkineni8 @vamsi84 ❤️❤️ #BlockbusterLenin #LENIN pic.twitter.com/DRY0RbzOOM
— appie 🎀 (@fizz_nandamuri) July 10, 2026
సినిమాలో అఖిల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అఖిల్ తన నటనతో థియేటర్లలో ఇరగదీశాడని ఫ్యాన్స్ అంటున్నారు. తన కెరీర్‌కు మంచి కంబ్యాక్ మూవీ అని అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్విట్స్ చేస్తున్నారు. మూవీలో వచ్చే ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఫస్టాప్ కాస్త స్లో అనిపించినా.. సెకండాఫ్ బాగుందని, ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్స్, భాగ్య శ్రీ బోర్సే యాక్టింగ్ కూడా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు.
#Lenin overall Great movie for Akhil! The second half is packed with crazy twists 🤯, and the BGM is top-notch. Definitely worth a watch. https://t.co/Wn9STaLidk
— Sanjay (@Sanjay_sq) July 10, 2026
ఈ సినిమాలో అఖిల్, భాగ్య శ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌కు ముందు వచ్చే 30 నిమిషాల సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని, ఊహించని ట్విస్టులు, యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయని అంటున్నారు. వీటన్నింటితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ పాయింట్ అని ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమా స్టోరీ కానీ, దాని నరేషన్ చాలా బాగుందని అంటున్నారు.
Akhil babu comeback 🔥🔥#Lenin pic.twitter.com/jYdxHlKCCt
— అభి (@Abhiiitweets) July 10, 2026
సినిమా స్టోరీ, దర్శకుడు స్క్రీన్ ప్లే, హీరోహీరోయిన్ల యాక్టింగ్‌తో పాటు సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా థియేటర్లలో రచ్చ చేసిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు వారి మేరకు నటించారు. ఫైనల్‌గా చాలా గ్యాప్ తర్వాత అఖిల్ మంచి సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడని, తన ఖాతాలో మరో హిట్ పడిందని అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.
Also Read : ఆకట్టుకోని నాగబంధం.. కుదరని క్యాస్టింగ్.. సినిమాలో మైనస్‌లు ఇవే!
#Lenin : Second half – enters the story, Niyamma twists padathaney untai end varakuuuu🔥📈🥵
heroine twist🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#AkkineniAkhil – Acting chimpesadu🔥#Thaman duty ekkesadu ✅#BhagyaShree right choice ❤️#Shivaji crazy assalu🔥Outdated story, but… pic.twitter.com/pHorAMt87m
— Reason2watch (@Reason2watch) July 10, 2026








