
Akanksha Chamola : ప్రముఖ టెలివిజన్ నటి, బిగ్ బాస్ విజేత గౌరవ్ ఖన్నా భార్య అయిన ఆకాంక్ష చమోలా మరోసారి వార్తల్లో నిలిచారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న లాక్ అప్ సీజన్ 2 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. వరుస బాంబులు పేలుస్తూ అందరినీ షాక్‌కు గురిచేస్తున్నారు. పోయిన వారమే తాను, తన భర్త గౌరవ్ ఖన్నా విడాకులు తీసుకోబోతున్నామనే చేదు నిజం చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన ఆకాంక్ష.. ఈ వారం తన జీవితానికి సంబంధించిన మరో పెద్ద రహస్యాన్ని బయటపెట్టాల్సి వచ్చింది.
Also Read : 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్.. గౌరీ స్ప్రట్‌తో సింపుల్ వెడ్డింగ్!
ఆమె పెళ్లికి ముందే బైసెక్సువల్అనే విషయాన్ని షోలో ఉన్న తోటి కంటెస్టెంట్ ఒకరు అందరి ముందు బయటపెట్టారు. దాంతో ఆకాంక్ష తన గతాన్ని అందరికీ వివరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఎమోషనల్ అయిపోయి, స్టేజ్ పైనే ఏడ్చేశారు. ఈ షోకి వచ్చిన మొదటి రోజు నుండి తన వ్యక్తిగత విషయాలన్నీ అందరి ముందు బయటపడిపోతున్నాయని, అస్సలు ఈ షోకి రావడమే తాను చేసిన పెద్ద తప్పు ఏమో అనిపిస్తోందని ఆకాంక్ష కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో హోస్ట్ ఫరా ఖాన్ ఆమెను దగ్గరకు తీసుకుని, ఓదార్చారు.
ఆకాంక్ష చమోలా గతంలో సంతోషి మా, యే హై ఆషికీ, క్రైమ్ పెట్రోల్ వంటి పాపులర్ టీవీ సీరియల్స్‌లో నటించారు. ఒక ఆడిషన్ సమయంలో ఆమెకు నటుడు గౌరవ్ ఖన్నాతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. 2016 నవంబర్ 24న గౌరవ్ సొంత ఊరైన కాన్పూర్‌లో మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పదేళ్ల లోపే వీరి బంధం విడాకుల వరకు రావడం, ఇప్పుడు ఆకాంక్ష పర్సనల్ లైఫ్ విషయాలు ఇలా బయటపడటం టీవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : అక్కినేని అఖిల్‌కు ఘోర ప్రమాదం: రెండు సర్జరీలు.. 48 కుట్లు..!









