Kerala : కేరళలోని అలప్పుళ జిల్లాలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. కేవలం ఐఫోన్, బైక్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బులు, బంగారం కోసం ఒక 13 ఏళ్ల అమ్మాయి తన 67 ఏళ్ల తాతనే దారుణంగా చంపేసింది. తన బాయ్‌ఫ్రెండ్, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో ఈ దారుణానికి ప్లాన్ వేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ హత్యను సినిమాల్లో చూపించినట్లే చాలా ప్లాన్‌గా చేశారని అధికారులు తెలిపారు.

తాత దగ్గరున్న 4.5 సవర్ల బంగారాన్ని దొంగిలించడమే కాకుండా, తన ఫోన్ వాడకంపై, అబ్బాయిలతో స్నేహాలపై తాత ఆంక్షలు పెట్టడం కూడా ఈ హత్యకు ఒక కారణం. అంతేకాకుండా తాత తనతో తప్పుగా ప్రవర్తించాడని కూడా ఆ అమ్మాయి తన ప్రియుడికి చెప్పి అతన్ని రెచ్చగొట్టింది. ఇంట్లో వాళ్లు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో, తాను పరీక్షల కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆ అమ్మాయి బయటకు వచ్చింది.

ఆ తర్వాత శనివారం రాత్రి ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్, అతని స్నేహితులు చేతులకు గ్లౌజులు వేసుకుని ఇంటి వెనుక ఉన్న వెంటిలేటర్ గుండా లోపలికి దూరి తాతను కట్టేసి దారుణంగా కొట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఈ దారుణం జరుగుతున్నంత సేపు ఆ అమ్మాయి వీడియో కాల్‌లో చూస్తూ ఉండటం గమనార్హం. వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న బంగారం తీసుకుని, పోలీసులను దారి మళ్లించడానికి ఇల్లంతా కారం పొడి చల్లారు.

మరుసటి రోజు ఆ అమ్మాయి ఏమీ తెలియనట్లు నటిస్తూ తాత తలుపు తీయడం లేదని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె చెప్పిన మాటల్లో తేడాలు రావడం, పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపడింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 24 గంటల్లోనే మిగతా అబ్బాయిలను పట్టుకుని బంగారం స్వాధీనం చేసుకున్నారు. సినిమాల ప్రభావం, ఇంట్లో ప్రేమ లభించకపోవడమే ఈ నేరానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.