CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌ రెడ్డి ఆగస్టు 20 నుంచి 30 వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK), అమెరికా (USA)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 20 న రాత్రి 12:30 గంటలకు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో లండన్‌కు బయలుదేరుతారు. ఉదయం 7:00 గంటలకు (UK స్థానిక కాలమానం) లండన్ చేరుకుంటారు.

Also Read : రూపారెడ్డి కేసులో బిగ్‌ ట్విస్ట్‌… ’బాబు’ అనే పిలుపే వారిని పట్టించింది!

ఆగస్టు 21ఉదయం 10:30 గంటలకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 6:00 గంటలకు ఎమిరేట్స్ స్టేడియంలో EPL ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్‌కు హాజరవుతారు. ఆగస్టు 22 ఉదయం 10:30 గంటలకు కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశమవుతారు. ఉదయం 11:30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను సందర్శిస్తారు.సాయంత్రం 4:00 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శిస్తారు.

ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్‌కు విమాన ప్రయాణం. ఆగస్టు 24 ఉదయం 10:30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎంఐటీ క్యాంపస్​కు వెళ్లానున్నారు. ఆగస్టు 25న ఉదయం 10.30 గంటలకు బోస్టన్​లో నార్త్‌ ఈస్టర్న్ క్యాంపస్​ను సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం అవుతారు. అనంతరం… రాత్రి 7 గంటలకు బోస్టన్ నుంచి న్యూయార్క్​ సిటీకి సీఎం పయనమవుతారు. ఆగస్టు 26న న్యూయార్క్​లో రాత్రి 7 గంటలకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌ కు బయలుదేరతారు. ఆగస్టు 30న హైదరాబాద్​కు చేరుకుంటారు.

Also Read : రాజీనామా చేసి మళ్లీ గెలవండి చూద్దాం… సీఎం రేవంత్‌ రెడ్డికి కొండా సుస్మిత సంచలన సవాల్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.