
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఒక వ్యక్తి ఇంట్లో సంచుల కొద్ది డబ్బు లభ్యమైంది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని లెక్కించగా రూ. 3 కోట్లుగా తేలింది. అయితే సదరు వ్యక్తి ఏ బిజినెస్‌మ్యానో, ప్రభుత్వ ఉద్యోగో కాదు. కేవలం ఆటోడ్రైవర్. అయితే ఈ ఘటన జరిగింది మధ్యప్రదేశ్‌లో. సదరు వ్యక్తి తుపాకీ పట్టుకొని ఉన్న ఫొటోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అది వైరల్‌గామారింది. అయితే ఆ ఫోటో చూసిన పలువురు అతని ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చారు, దీంతో పోలీసులు సోదా చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన పోలీసులకు ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బుల సంచులు దొరకడం సంచలనంగా మారింది.
Also Read : గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టె దిశగా కేంద్రం అడుగులు.. దేశీయ కంపెనీలకు టార్గెట్
మధ్యప్రదేశ్‌లోని సాగర్ ప్రాంతంలో నివాసం ఉండే సౌరభ్ అహిర్వార్ ఇటీవల తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా, పోలీసులు సోషల్ మీడియాలో సాధారణ తనిఖీలలతో భాగంగా రెచ్చగొట్టే పోస్టులను తనిఖీ చేస్తుండగా సౌరభ్ ఫోటో వారి కంటపడింది. దీంతో పోలీసులు అతడి ఇంటికి వెళ్లి తుపాకీ కోసం సోదాలు చేశారు. తనిఖీల్లో ఎలాంటి ఆయుధం లభించలేదు కానీ.. ఓ బీరువా అనుమానాస్పదంగా కన్పించింది. అనుమానం వచ్చిన పోలీసులు దాని గురించి కుటుంబసభ్యులను అడగగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మరింత అనుమానంతో పోలీసులు బీరువాను పగలగొట్టారు. దీంతో సంచల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి.
ఒక మాములు ఆటో డ్రైవర్ ఇంట్లో ఇంత పెద్దమొత్తంలో నగదు కనిపించడంతో పోలీసులు ఒకసారిగా అవక్కాయ్యారు. వెంటనే నగదు లెక్కించే యంత్రాలను తెప్పించి సుమారు ఐదు గంటల పాటు శ్రమించి లెక్కించగా రూ.3 కోట్లు ఉన్నాయని తేలింది. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ఆటో డ్రైవర్ కుటుంబాన్ని పోలీసులు అరా తీశారు. అయితే, ఆ డబ్బుతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపడం గమనార్హం. భోపాల్‌లో ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తమ బంధువు కుటుంబ సభ్యులదని వారు వెల్లడించారు. కొన్ని నెలల క్రితం తమ బంధువు వాటిని తీసుకువచ్చితన ఇంట్లో దాచాడని సౌరభ్ విచారణలో పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read : ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరికి గాయాలు!









