
PM MODI : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన దుస్తులు, ముఖ్యంగా ఆయన పాకెట్ స్క్వేర్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధాని మోదీ ఫోటోను పంచుకున్నారు. చూస్తుంటే మోదీ జీ త్రివర్ణ పతాకాన్ని తప్పుగా ధరించినట్లుంది. భారత్‌కు బదులుగా ఐర్లాండ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు.
Also Read : VIP గొడవ: మహిళా ఎస్‌ఐపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే కుమార్తె!
Lagta hai sahib ne Urdu mein Tiranga pehna hai.
Ya phir Bharat 🇮🇳 ki jagah Ireland 🇮🇪 ka Independence Day mana rahay hain. pic.twitter.com/g0EiOLWICI
— Pawan Khera 🇮🇳 ಪವನ್ ಖೇರಾ (@Pawankhera) August 15, 2026
సాధారణంగా భారత జాతీయ జెండాలో పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. కానీ ప్రధాని మోదీ ధరించిన పాకెట్ స్క్వేర్‌లో ఈ రంగులు తిరగబడి (ఆకుపచ్చ, తెలుపు, కాషాయం) అమరి ఉన్నాయి. అయితే ఐర్లాండ్ జాతీయ జెండాలో ఎడమ నుండి కుడికి వరసగా ఆకుపచ్చ, తెలుపు, కాషాయం రంగులు ఉంటాయి. మోదీ పాకెట్ స్క్వేర్ రంగులు కూడా సరిగ్గా ఐర్లాండ్ జెండా క్రమాన్ని పోలి ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ఈ కామెంట్స్ చేశారు.
కాగా గత పదేళ్లకు పైగా స్వాతంత్ర్య , గణతంత్ర దినోత్సవాల్లో ప్రధాని మోదీ ధరించే తలపాగాలు, దుస్తుల ప్రత్యేక శైలి ఎప్పుడూ ఆకర్షణగా నిలుస్తుంటాయి. 2014లో ఎరుపు రంగు రాజస్థానీ బంధేజ్ తలపాగా నుంచి మొదలుకొని, 2022లో 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా త్రివర్ణ పతాక రంగులతో కూడిన తలపాగా వరకు ఆయన దుస్తుల ఎంపికపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది పాకెట్ స్క్వేర్‌లోని రంగుల వరుస క్రమం మారడం సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వైరల్ అయింది. మరి కాంగ్రెస్ ఎంపీ చేసిన ఈ కామెంట్స్ పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : జనగణన-2027తో పాటే సమగ్ర కుల గణన… కేంద్రం కీలక ప్రకటన









