
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ స్కూళ్ల ఫీజుల వివరాలపై విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రైవేట్ స్కూళ్లు తమ వద్ద వసూలు చేసే ఫీజులను బయట పెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ వివరాలను విద్యాశాఖ అధికారిక పోర్టల్‌లో కూడా పొందుపరచాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల స్ట్రక్చర్‌ను బోర్డులపై, సైట్లలో అందుబాటులో ఉంచని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు పాటించని యాజమాన్యాలకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి చెక్ పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు.
Also Read : బిగ్ షాక్.. హైదరాబాద్‌లో రేపటి నుంచి ఓలా, ఉబర్, ర్యాపిడో బంద్
Also Read : నిరుద్యోగులకు HYDRAA శుభవార్త.. టెన్త్ అర్హతతో ఎగ్జామ్ లేకుండా జాబ్స్.. రేపు, ఎల్లుండే ఛాన్స్!









