
TG Jobs: హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ వంటి పనులతో అనతికాలంలోనే గుర్తింపు పొందిన హైడ్రా (HYDRAA – హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైడ్రాలో పనిచేయడానికి అభ్యర్థులు కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. హైడ్రాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియమకాలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా క్రీడా నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా అధికారులు వెల్లడించారు.
Also Read : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ బంపరాఫర్.. ఆగస్ట్ 15న మూడు గిఫ్ట్‌లు.. లిస్ట్ ఇదే!
కాగా హైడ్రా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 100 పోస్టులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్ సంబంధించినవి కాగా, మిగిలిన 50 ఉద్యోగాలు హెవీ వెహికల్స్ డ్రైవర్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది. కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదన. పదో తరగతి (SSC) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపింది. డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసేఅభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.
ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా శారీరక సామర్థ్య పరీక్షల (Physical Tests) ఆధారంగానే నిర్వహించనున్నారు. అభ్యర్థులు 800 మీటర్ల రన్నింగ్‌ను 2 నిమిషాల 50 సెకన్లలో (170 సెకన్లు), 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాలని, వీటితో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్ , 7.2 కేజీల షాట్‌పుట్‌ను 6 మీటర్ల దూరం విసరడం లాంటి భౌతిక పరీక్షలు నిర్వహించనున్నారు. దీని కోసం పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
కాగా, ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదని. ఆసక్తి, తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు , పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియను హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ఆగస్టు 8 , 9వ తేదీల్లో ఉదయం 5:00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Also Read : HIV రిస్క్ ఎంతుందో తెలిపే క్యూఆర్ కోడ్… ఎలా తెలుస్తుందంటే?









