Salman Khan :  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్‌కు సంబంధించి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. సాధారణంగా ఆయన ప్రతి సినిమాకు భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటుంటాడు సల్మాన్ . అయితే టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SVC63’ సినిమా కోసం సల్మాన్ ఖాన్ తన రెమ్యునరేషన్‌లో భారీగా కోత విధించినట్లు సమాచారం వస్తోంది. సాధారణంగా ఆయన రూ. 120 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుండగా, ఈ సినిమా కోసం కేవలం రూ. 70 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం వెనుక సల్మాన్ ఖాన్ మంచి మిత్రుడైన రఫీ కాజీ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ సెట్ కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అంతేకాకుండా ఈ చిత్రానికి ఆయన కూడా నిర్మాతలలో ఒకరిగా వ్యవహరిస్తున్నారని సమాచారం. గత 20 ఏళ్లుగా తాను చేసే ప్రతి చిత్రానికి రూ. 120 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగి ఉన్న సల్మాన్ ఖాన్.. తన మంచి స్నేహితుడైన రఫీ కాజీ కోసమే ఈ ప్రాజెక్ట్‌కు ఈ డిస్కౌంట్ ఇచ్చినట్లు ఒక ఇండస్ట్రీ ఇన్‌సైడర్ తెలిపారు.

Also Read : నేను NEET పేపర్ లీక్ బాధితురాలినే… బాలీవుడ్ నటి సంచలన కామెంట్స్!

ఈ చిత్రంలో రఫీ కాజీ పేరు సహ నిర్మాతగా కనిపిస్తుందని, కేవలం స్నేహం గురించినే సల్మాన్ తన పారితోషికాన్ని భారీగా తగ్గించుకోవడానికి ఒప్పుకున్నారని వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌కు లాభాల్లో ఏమైనా వాటా ఉందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ తన సినిమాలకు సంబంధించి లాభాల్లో వాటా ఉండే పద్ధతినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. 2010లో వచ్చిన దబాంగ్ సినిమా నుంచి ఆయన చేసిన చాలా సినిమాలు ఆయన కుటుంబ సభ్యుల బ్యానర్‌లో లేదా సొంత నిర్మాణ సంస్థ అయిన సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ద్వారానే నిర్మించబడ్డాయి. దబాంగ్ సినిమాను ఆయన తమ్ముడు అర్బాజ్ ఖాన్ నిర్మించగా, బాడీగార్డ్ సినిమాకు ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి నిర్మాతగా వ్యవహరించారు.

సల్మాన్ ఖాన్ త్వరలో అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ చిత్రంలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Also Read : ఏకంగా సాయిపల్లవినే డ్యామినెట్ చేసింది… ఎవరి బ్యూటీ?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.