
NEET Paper Leak : బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మనుషీ చిల్లర్ తన విద్యార్థి దశలోని కష్టాలను గుర్తుచేసుకున్నారు. 2015లో నీట్ పేపర్ లీక్ కావడం వల్ల తాను మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఆమె మాట్లాడారు.
Also Read : హీరోయిన్ రష్మిక మందన్నకు తీవ్ర గాయం
తాను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడే కూచిపూడి నృత్యం, పెయింటింగ్ వంటి కళలన్నింటినీ పక్కనపెట్టి, కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ పైనే పూర్తిగా దృష్టి పెట్టాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. తన తల్లిదండ్రులు కూడా గతంలో ఇదే ప్రయాణాన్ని ఎదుర్కొన్నవారు కావడంతో మానసికంగా ముందుగానే సిద్ధమయ్యానని, అయినప్పటికీ ఆ క్షణాలు చాలా కష్టంగా గడిచాయని వెల్లడించారు.
నెలల తరబడి కష్టపడి చదివిన తర్వాత, మళ్లీ మరో 45 రోజులు అదనంగా ప్రిపేర్ కావాలని చెప్పినప్పుడు.. ఇక మనలో ఎంత ఓపిక మిగిలి ఉందనే నిరాశ కలుగుతుందని మనుషి పేర్కొన్నారు. అయితే తన తల్లిదండ్రులు తనకు పూర్తి మద్దతుగా నిలిచారని, ఎన్ని పనులున్నా సరే రోజూ కనీసం గంటపాటు వ్యాయామం చేయాలని వారు కచ్చితంగా చెప్పేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. బాస్కెట్‌బాల్ ఆడటం లేదా జిమ్‌కు వెళ్లడం వల్ల చదువు ఒత్తిడి నుంచి బయటపడేందుకు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో సహాయపడిందని, కానీ తోటి విద్యార్థుల్లో చాలామందికి ఆ అదృష్టం దక్కలేదని ఆమె తెలిపారు.
కాగా, మనుషీ చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని ఇండియాకు కీర్తిని తెచ్చారు. ఆ తర్వాత 2022లో అక్షయ్ కుమార్ సరసన స్రామట్ పృథ్వీరాజ్ సినిమాతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Also Read : ‘శ్రీనివాస మంగాపురం’ లో సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ! వీడియో వైరల్









