Ramayana :  దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలోని నటీనటులు, వారు పోషిస్తున్న పాత్రల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే ట్రైలర్ లో సీత పక్కన అంటే సాయిపల్లవి పక్కన కనిపించిన ఓ బ్యూటీ అందరని ఆకర్షించింది. ఆమె ఏకంగా సాయిపల్లవినే డామినెట్ చేస్తుండటంతో ఆమె గురించి నెటిజన్లు సెర్చింగ్ మొదలుపెట్టారు.

Image

ఆమెఅస్సామీ నటి సురభి దాస్, నిమా డెంజోంగ్‌పా, పాండ్య స్టోర్ వంటి టెలివిజన్ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈమె రామాయణ చిత్రంలో సీత చెల్లెళ్లలో ఒకరైన శ్రుతకీర్తిగా, శత్రుఘ్నుడి భార్యగా కనిపించనున్నారు. సురభి కెరీర్‌లోనే రామాయణ ఇప్పటివరకు అత్యంత భారీ ప్రాజెక్ట్.

Also Read : అలా మాట్లాడడం సిగ్గుచేటు… కంగనాకు సోనూసూద్ కౌంటర్!

Image

“రామాయణంలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది, అది చిన్న పాత్ర అయినప్పటికీ సంతోషమే. నాకు ఫోన్ వచ్చినప్పుడు, నేను కేవలం షార్ట్‌లిస్ట్ అయ్యానా లేక సినిమా కోసం నిజంగానే లాక్ అయ్యానా అని ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు అసలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఇంత పెద్ద తారాగణం, ఇంత భారీ బడ్జెట్‌తో కూడిన చిత్రంలో భాగం కావడం కలలో జరుగుతున్నట్లుగా ఉంది” అని ఆమె తెలిపారు.

Image

ఈ అవకాశం తనకు ఎలా వచ్చిందనే దాని గురించి కూడా సురభి మాట్లాడారు. మొదట కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ ఛబ్రా వద్ద తాను ఆడిషన్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. దాదాపు రెండు నెలల తర్వాత, పాండ్య స్టోర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో, తాను ఈ సినిమాకు ఎంపికైనట్లు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టే ముందు లుక్ టెస్ట్‌లు, కాస్ట్యూమ్ ట్రయిల్స్ జరిగాయని తెలిపారు. పరిశ్రమలోని దిగ్గజాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ తనకు కలలాగే అనిపిస్తోందని అన్నారు.

Image

నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘రామాయణ’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, అరుణ్ గోవిల్ దశరథ మహారాజుగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.

Also Read : ‘శ్రీనివాస మంగాపురం’ లో సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ! వీడియో వైరల్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.