LPG Cylinder Price Hikes
LPG Cylinder Price Hikes

ఆగస్టు 1వ తేదీ నుంచి దేశంలో కొన్ని రూల్స్ మారబోతున్నాయి. వీటిలో రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌తో పాటు ఆదాయపు పన్ను, క్రెడిట్ కార్డులు, గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో కూడా మార్పులు రానున్నాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Also Read : పరీక్ష పేపర్ లీకేజీలకు చెక్.. లోక్‌సభలో సవరణ బిల్లు.. అందులో ఏమున్నాయంటే?

రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్

రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఉండే విపరీతమైన రద్దీని తగ్గించడానికి, ప్రయాణికులకు సులభంగా టికెట్లు లభించేలా చేయడానికి భారతీయ రైల్వే తత్కాల్ బుకింగ్ విధానంలో మార్పులు చేసింది. ఆగస్టు 1 నుంచి టోకెన్ జారీ చేసే సమయాన్ని, తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభ సమయానికి అనుగుణంగా మార్చారు. గతంలో టోకెన్లు తీసుకోవడానికి, టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వేర్వేరు సమయాల్లో కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సి వచ్చేది. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు కౌంటర్ల వద్ద తోపులాటలు తగ్గి బుకింగ్ ప్రక్రియ వేగవంతంగా అవుతుంది.

ఆదాయపు పన్ను

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఆగస్టు 1 నాటికి ఈ గడువు ముగుస్తుండంతో సకాలంలో ఐటీఆర్‌ దాఖలు చేయని వారికి ఆలస్య రుసుముతో కూడిన జరిమానాలు పడతాయి. అంతేకాకుండా గడువు దాటిన తర్వాత రిటర్న్ దాఖలు చేస్తే పాత లేదా కొత్త పన్ను విధానాల్లో ఉండే కొన్ని ప్రత్యేక మినహాయింపులను ఎంచుకునే అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు కోల్పోతారు. వ్యాపారాలు, ఆడిటింగ్ అవసరమైన వర్గాలకు గడువు వేర్వేరుగా ఉన్నప్పటికీ సాధారణ వేతన జీవులు సకాలంలో స్పందించనున్నారు.

క్రెడిట్ కార్డులు ఫిక్స్డ్ డిపాజిట్

ఆగస్టు 1 నుంచి ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ నిబంధనలలో మార్పులు చేసే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డుల ద్వారా లభించే రివార్డ్ పాయింట్లు, లేట్ పేమెంట్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర సేవా రుసుముల్లో వ్యత్యాసాలు రావచ్చు. దీనికి తోడు, ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో రెపో రేటు ఆధారంగా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను, లోన్ EMIలను సమీక్షించే అవకాశం ఉంది. కాబట్టి మీ బ్యాంక్ ఇచ్చే నోటిఫికేషన్లను తనిఖీ చేసుకోవడం మంచిది.

ఎల్‌పిజీ గ్యాస్ సిలిండర్ ధరల

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు, ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. ప్రతి నెలా మొదటి తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సిలిండర్ ధర పెరిగితే అది సామాన్యుల వంటగది బడ్జెట్‌పై అదనపు భారం అవుతుంది.

Also Read : ఊరమాస్ ఒప్పో ఫోన్: 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఫీచర్లు హైలైట్..!

ఆధార్ ఆధారిత సీకేవైసీ 2.0 విధానం

ఆగస్టు 2026 నాటికి భారతీయ బ్యాంకులు, బీమా సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఉమ్మడిగా సెంట్రల్ నో యువర్ కస్టమర్ 2.0 వ్యవస్థను అమలు చేయనున్నాయి. ఈ కొత్త ఆధార్ ఆధారిత డిజిటల్ సిస్టమ్ ద్వారా కస్టమర్ల అనుమతి ఉన్నప్పుడు మాత్రమే సెంట్రల్ రిజిస్ట్రీలోని డేటాను బ్యాంకులు యాక్సెస్ చేయగలవు. దీనివల్ల ఆర్థిక మోసాలు, నకిలీ ఖాతాల నిర్వహణ అరికట్టడానికి వీలవుతుంది. కస్టమర్ డేటా భద్రత మరింత పెరుగుతుంది.