
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Oppo చైనా మార్కెట్లో తన Oppo K15 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Oppo K15 మీడియాటెక్ డైమెన్సిటీ 7000 సిరీస్ చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Oppo K15 Price
Oppo K15 మొబైల్ 12 GB + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.33,000గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో చైనా ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది గేల్ గ్రే, రాపిడ్ వైట్ కలర్లలో లభిస్తుంది.
Oppo K15 Specifications
Oppo K15లో 6.59-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 1256×2760 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. Oppo K15 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16పై పనిచేస్తుంది. ఇది ARM మాలి-G615 GPUతో కూడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్సెట్తో పనిచేస్తుంది. ఇందులో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP69 రేటింగ్‌ను కలిగి ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. Oppo K15లో ఆటోఫోకస్, డ్యూయల్-యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫీల్డ్ ఆఫ్ వ్యూతో కూడిన 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆటోఫోకస్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 8,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్, GPS ఉన్నాయి.









