
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్ కీలక కేంద్రాలపై అమెరికా తీవ్రమైన దాడులు చేస్తోంది. అయితే ఈ దాడులకు ప్రతీకారంగా రీవెంజ్ తీసుకోవాలని ఇరాన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఎర్ర సముద్రానికి గుండెకాయ లాంటి.. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన బాబ్ అల్-మందెబ్ జలసంధిని పూర్తిగా మూసివేయాలని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సంకేతాలు పంపినట్లు సమాచారం. ఇరాన్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే హౌతీలు భారీ ఎత్తున తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దు: అక్టోబర్ 27న ఎన్నికలు!
Bab al-Mandeb over the last 24 hours: no disruptions.
Video from @MarineTraffic pic.twitter.com/i0tBI5MBlD
— HFI Research (@HFI_Research) July 17, 2026
అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లను బాబ్ అల్-మందెబ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో రవాణాకు ఇబ్బంది అవుతోంది. ఈ సమయంలో ఎర్ర సముద్ర మార్గం కూడా మూతపడితే ప్రపంచ చమురు రవాణా పూర్తిగా స్తంభించిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రవాణాకు ఈ బాబ్ అల్-మందెబ్ జలసంధి కీలకం. ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను కలిపే ఈ సముద్ర పాయ మీదుగానే ఆసియా, ఐరోపా ఖండాల మధ్య నిత్యం వేలాది నౌకలు చమురు, సహజవాయువు, ఇతర వాణిజ్య సరకులతో ప్రయాణిస్తుంటాయి.
ఒకవేళ హౌతీలు కనుక ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే అంతర్జాతీయ నౌకలన్నీ ఆఫ్రికా ఖండం చివరన ఉన్న ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా ఎన్నో వేలాది మైళ్లు చుట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరుగుతాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్‌పై అమెరికా చేస్తు్న్న దాడుల నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తన భూభాగంపై దాడి జరిగితే ఆ నష్టం కేవలం తనకే పరిమితం కాకూడదని ప్రపంచ వాణిజ్యాన్నే దెబ్బతీయాలని ఇరాన్ భావిస్తోంది.
Also Read : ట్రంప్ మరో సంచలనం… విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్!
అందులో భాగమే హౌతీలను తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే దీనివల్ల పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగలనుంది. ఎందుకంటే హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవల సౌదీ అరేబియాపై మళ్లీ క్షిపణి దాడులు ప్రారంభించారు. ఒకవైపు పొరుగు దేశమైన ఇరాన్‌తో సంబంధాలు పాడుచేసుకోలేక.. మరోవైపు ఆర్థికంగా తమను ఆదుకునే సౌదీ అరేబియాను వదులుకోలేక ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోంది.
గతేడాది పాక్, సౌదీ మధ్య ఓ రహస్య రక్షణ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం వేలాది మంది పాకిస్థాన్ సైనికులు సౌదీ అరేబియాలో ప్రస్తుతం రక్షణ విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు గనుక సౌదీపై దాడులు తీవ్రం చేస్తే.. పాకిస్థాన్ సైలెంట్‌గా అసలు ఉండదు. ఈ క్రమంలోనే పాక్ ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి స్పందించారు.
సౌదీ అరేబియాపై దాడి జరిగితే అది పాకిస్థాన్‌పై జరిగిన దాడిగానే భావిస్తాంమని.. అదే మా రెడ్ లైన్ అని వార్నింగ్ ఇచ్చారు. ఇదే కనుక జరిగితే పాకిస్తాన్ కూడా డైరెక్ట్‌గా యుద్ధంలోకి దిగనుంది. మరోవైపు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఎర్ర సముద్ర మార్గం మూతబడితే ఇంధన దిగుమతులు నిలిచిపోతాయి. ఆ దేశం ఆర్థికంగా మరింత ఇబ్బంది పడనుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధం ఇంకా మొదలుకాలేదు. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందని ప్రపంచ దేశాలు భయంతో ఉంటున్నాయి.









