telugu movies and series this week theatre ott
telugu movies and series this week theatre ott

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. థియేటర్, ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

నాగబంధం

విరాట్ కర్ణ హీరోగా, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తు్న్న ‘నాగబంధం’ మూవీ జూలై 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వం వహించారు.

రావు బహదూర్

సత్యదేవ్ హీరోగా డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్న కొత్త చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా దర్శకత్వంలో దీపా థామస్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం జూలై 3న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఆల్ఫా

బాలీవుడ్ నుంచి వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆల్ఫా’. ఇందులో అలియా భట్, శార్వరీ వాఘ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ దేవోల్ వంటి స్టార్ నటులు కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ కూడా జూలై 3న రిలీజ్ కానుంది.

Also Read : రెమ్యునరేషన్ ఎగ్గొట్టారు.. హైకోర్టులో కేసు వేసిన లేడీ డైరెక్టర్!

ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లు

గుర్తుకొస్తున్నాయి

‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్, యశశ్రీ జంటగా నటిస్తున్న ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ జూలై 3న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉండనుంది.

సూపర్‌ సుబ్బు

సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న ‘సూపర్‌ సుబ్బు’ సిరీస్ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమైంది. ఈ సిరీస్ జులై 4 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్

ఇసకపట్నం (సిరీస్‌) తెలుగు/తమిళ్‌ – జూన్ 2
అబ్సెషన్‌ (సినిమా) ఇంగ్లిష్‌ (రెంటల్ విధానంలో)

జియో హాట్‌స్టార్‌

మాలీవుడ్‌ టైమ్స్‌ (సినిమా) మలయాళం/ తెలుగు
ప్రీతమ్‌ అండ్‌ పెడ్రో (సిరీస్‌) హిందీ
ఎక్స్‌మెన్‌ 97: సీజన్‌2 (సిరీస్‌) ఇంగ్లిష్‌

నెట్‌ఫ్లిక్స్‌

ది చోరల్‌ (సినిమా) ఇంగ్లిష్‌
సర్వెవల్‌ ఆఫ్‌ ది థిక్కెస్ట్‌: సీజన్‌3 (సిరీస్‌) ఇంగ్లిష్‌
ది మిడ్‌నైట్‌ రొమాన్స్‌ ఇన్‌ హ్యాగ్‌వోన్‌ (సినిమా) కొరియన్‌
ఎనోలాహోల్మెస్‌ 3 (సినిమా) ఇంగ్లిష్‌/తెలుగు

జీ5

వీరభద్రుని రహస్యం (వీక్లీ సిరీస్‌) జూన్‌ 3
ముత్తాసి (సిరీస్) మలయాళం

సన్‌నెక్ట్స్‌

హ్యాంగ్‌ మెన్‌ (సినిమా) తమిళ్‌

Also Read : కొరటాల, బాలయ్య సినిమా షురూ.. మామ సినిమాకు అల్లుడు క్లాప్!