మేషం
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంట్లో ఒక శుభవార్త ఆనందాన్ని నింపుతుంది. శివ ధ్యానం మంచిది.

వృషభం
కీలక విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం.

మిథునం
ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. నవగ్రహ ధ్యానం చేయడం మంచిది.

కర్కాటకం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. పనులను పట్టుదలగా పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వేంకటేశ్వరస్వామిని సందర్శించడం వల్ల శుభం కలుగుతుంది.

సింహం
మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోల్పోకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవడం ముఖ్యం. విష్ణు ఆరాధన శుభప్రదం.

కన్య
పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. దైవబలం మీకు తోడుగా ఉంటుంది. బుద్ధితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. బాధ కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

Also Read : కోలీవుడ్‌లో మరో బ్రేకప్.. దళపతి విజయ్‌ను అన్‌ఫాలో చేసిన త్రిష

తుల
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఒక మంచి వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవిని పూజించడం ఉత్తమం.

వృశ్చికం
మీకు చాలా అనుకూల సమయం. అన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ధనలాభం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీదేవి ఆరాధన కలిసివస్తుంది.

ధనుస్సు
మీరు పడిన శ్రమ వృథా పోదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమయానికి ఆదుకునే మిత్రులు ఉంటారు. ఆంజనేయ స్తోత్రం చదవడం మంచిది.

మకరం
మంచి ఫలితాలు సాధించడానికి ఇది సరైన సమయం. పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. ఇష్టదైవాన్ని స్మరించడం వల్ల మేలు జరుగుతుంది.

కుంభం
పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఎదుటివారి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కోపాన్ని తగ్గించుకోవడం, గోసేవ చేయడం మంచిది.

మీనం
పెద్దల మాటలు పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. ధనలాభం, మనశ్శాంతి లభిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమత్ ఆరాధన మీకు శుభప్రదం.

Also Read : లక్నోలోని కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం.. స్పాట్ లో 15 మంది