తమిళనాడు సీఎం దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషల మధ్య రిలేషన్ ఉందని గత కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ తన భార్య సంగీతతో తీవ్రమైన విభేదాల కారణంగా విడాకులు తీసుకోబోతున్నారని, త్వరలోనే త్రిషను అధికారికంగా వివాహం చేసుకోనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. వీటిపై విజయ్, త్రిష అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఫంక్షన్లకు కలిసి వెళ్లడం వల్ల ఈ రూమర్స్ నిజమేనని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఘటన వీరి మధ్య రిలేషన్ బ్రేక్ అయ్యిందని సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి.

Also Read : మరో వారసుడొచ్చాడు.. నారా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్!

Trisha Unfollows Vijay

జూన్ 22న దళపతి విజయ్ పుట్టినరోజున త్రిష సోషల్ మీడియా వేదికగా విష్ చేయలేదు. ప్రతీ ఏడాది త్రిష అందరి కంటే ముందే విజయ్‌కు విష్ చేస్తుంది. కానీ ఈ సారి చేయకపోవడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో త్రిష విజయ్‌ను అన్‌ఫాలో చేశారు. దీంతో వీరిద్దరి లవ్‌కు ఎండ్ కార్డు పడిందని, గొడవలు మొదలయ్యాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి దీనిపై విజయ్, త్రిష స్పందిస్తారో లేదో చూడాలి.

Also Read : ‘పెద్ది’ డిజాస్టర్.. రెమ్యూనరేషన్ వదులుకున్న రామ్ చరణ్!