
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనలో నేడు యుఎస్ మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. వైట్ హౌస్‌పై పట్టు కొనసాగించాలా లేక ట్రంప్ పగ్గాలకు చెక్ పెట్టాలా అమెరికన్ ఓటర్లు తీర్పునిస్తున్నారు. జాతీయ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, ప్రిడిక్షన్ మార్కెట్లు అన్నీ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి తీవ్ర ప్రతికూల సంకేతాలను ఇస్తుండటంతో వాషింగ్టన్ వర్గాల్లో ఒణుకు మొదలైంది. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభను చేజిక్కించుకునే దిశగా స్పష్టమైన ఆధిక్యంలో ఉండడమే కాకుండా.. ఊహించని విధంగా పలు సంప్రదాయ రిపబ్లికన్ రాష్ట్రాల్లో సైతం విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే ట్రంప్‌కు వ్యతిరేకంగా సర్వేలు చెబుతున్నాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.
Also Read : నేడే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. ఈ పోరులో గెలిచేది ఎవరు?
Trump’s final midterm reckoning: 100 million Americans deliver their verdict as his approval hits rock bottom and Democrats dream of a ‘blue tsunami’ in his nightmare scenario https://t.co/aRSRDEaOIf
— Daily Mail (@DailyMail) November 3, 2026
ట్రంప్ తన మొదటి విడత ఎన్నికల ప్రచారంలో విదేశీ యుద్ధాలకు అమెరికా స్వస్తి పలుకుతుంది అని హామీ ఇచ్చారు. కానీ ఇరాన్‌లోని ఖేష్మ్ ఐలాండ్, ఇతర ప్రాంతాలపై అమెరికా రహస్యంగా జరిపిన మిలిటరీ దాడులు తీవ్ర దుమారం రేపాయి. ఈ సైనిక చర్యల కారణంగా ఇరాన్ కూడా ప్రతిదాడికి దిగడం, గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ముదిరి పర్యవసానంగా అమెరికాలో గ్యాస్, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడం పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని పెంచింది. ఇది అమెరికాకు అనవసరమైన యుద్ధం అని స్వయంగా రిపబ్లికన్ పార్టీకి చెందిన మద్దతుదారులు కూడా భావిస్తున్నారు. అలాగే ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ట్రంప్‌పై వ్యతిరేకం రావడానికి ఇది ఒక కారణమని చెప్పవచ్చు.
Also Read : నిరసనల పేరుతో Gen Z టూటీలు.. 34 నగరాల్లో రోడ్ల మీదకు యూత్!
ట్రంప్ విధించిన కొత్త విదేశీ సుంకాలు, పన్ను విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు, గృహ నిర్మాణం, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయి. తాజాగా జరిగిన మార్ష్ సర్వే ప్రకారం దాదాపు 74% కంటే ఎక్కువ మంది పౌరులు ట్రంప్ ఆర్థిక నిర్వహణ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. 40% పైగా ప్రజలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి గత రెండేళ్లలో దారుణంగా క్షీణించిందని చెప్పారు. అలాగే వీసా విధానాల్లో కఠిన నియమాలు తీసుకురావడం కూడా ట్రంప్‌పై వ్యతిరేకానికి ఒక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే హెచ్-1బీ వీసాలపై తెచ్చిన నిబంధనలు అమెరికాలోని ఐటీ, కార్పొరేట్ కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీనికితోడు సాధారణ ప్రజలకు అందించే ఆరోగ్య సంరక్షణ రాయితీలలో తీవ్ర కోతలు విధిస్తూ తీసుకున్న నిర్ణయాలు ఓటర్లలో విపరీతమైన ఆగ్రహాన్ని పెంచాయి.
ఒకవేళ డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో మెజారిటీ సాధిస్తే.. ట్రంప్ ప్రభుత్వానికి వచ్చే రెండేళ్లు సవాళ్లతో కూడుకున్నవిగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టాలు, పన్ను మార్పులు, బడ్జెట్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి కావడంతో నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఇరాన్‌పై సైనిక దాడుల నిర్ణయంతో పాటు అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిధుల వినియోగం వంటి అంశాలపై డెమోక్రాట్లు కాంగ్రెస్ విచారణలు చేపట్టే అవకాశం ఉంది. అవసరమైతే సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసి, ట్రంప్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చు.









