Mokshagna :  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. విశ్వంభర దర్శకుడు వశిష్ఠ మోక్షజ్ఞ తొలి సినిమాను తెరకెక్కించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది. ఆదివారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో మోక్షజ్ఞ మొదటి సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

Also Read : ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయి వివాదంలో బిగ్ ట్విస్ట్

కాగా మోక్షజ్ఞను దర్శకుడు ప్రశాంత్ వర్మతో పరిచయం చేయాలని గతంలో ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. తాజాగా వశిష్ఠ చెప్పిన కథతో మోక్షజ్ఞ తొలి సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ‘సింబా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల పేరు కూడా వినిపిస్తోంది. మోక్షజ్ఞను తొలిసారి హీరోగా తెరపై చూసేందుకు అభిమానులకు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

మోక్షజ్ఞ డెబ్యూపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా కథ, నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సింబా అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. మోక్షజ్ఞ తొలి సినిమా విషయంలో అధికారిక క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : పెళ్లైన 5 నెలలకే విడాకులు.. రాపర్ బాద్‌షా, నటి ఇషా రిఖీ సంచలన ప్రకటన

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.