Madhuri Rathod : ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించింది. ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా కుటుంబసభ్యులు గమనించి గది తలుపులు పగులగొట్టి ఆమెను కాపాడినట్లు సమాచారం. వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి మోసం చేశాడని మాధురి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె ఈ అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

Also Read : ఈశ్వర్ సాయిపై కేసు.. పరువు తీశారంటూ మాధురి ఫిర్యాదు

మాధురి, ఈశ్వర్ సాయి వివాదం గత కొన్ని వారాలుగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. వేములవాడలో వీరిద్దరూ ఒకే గదిలో ఉన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య శరణ్యతోనూ మాధురికి వివాదం ఏర్పడింది. తనపై దాడి చేసి, అవమానించారని ఆరోపిస్తూ మాధురి గతంలో వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.

ఇక తాజాగా సెప్టెంబర్ 1న మాధురి రాథోడ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని, శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈశ్వర్ సాయిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

ఈ వివాదంపై ఈశ్వర్ సాయి కూడా గతంలో స్పందించాడు. తనకు, మాధురికి సంబంధించిన వ్యవహారంలో బయటకు వచ్చిన విషయాల్లో చాలా భాగం ప్రజలకు తెలియదని చెప్పాడు. మరోవైపు మాధురి ఆరోపణలు, పోలీసు ఫిర్యాదులపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మాధురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Also Read : టాలీవుడ్ లో మరో ప్రేమజంట…పెళ్లిపీటలెక్కనున్న కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.