
Madhuri Rathod : ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బిగ్ షాక్ తగిలింది. తనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు డ్యాన్సర్ మాధురి రాథోడ్. తన ఫోన్‌లో ఉన్న వీడియోలను ఉపయోగించి ఏఐ వీడియోలు తయారు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ పోలీసులకు ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు చూపించేలా కొన్ని ఏఐ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మాధురి తన ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో తన పరువుకు భంగం కలిగిందని ఆమె పోలీసులను ఆశ్రయించింది.
అలాగే ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో శారీరక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత మోసం చేశాడని కూడా మాధురి ఆరోపించింది. మాధురి రాథోడ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈశ్వర్ సాయి కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నారు.
Also Read : పెళ్లైన 5 నెలలకే విడాకులు.. రాపర్ బాద్‌షా, నటి ఇషా రిఖీ సంచలన ప్రకటన
ఇటీవలే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వేములవాడలోని ఓ హోటల్‌లో వీరిద్దరూ ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వెళ్లడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఆ ఘటన తర్వాత మాధురి రాథోడ్ కూడా ఈశ్వర్ సాయి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం ఈశ్వర్ సాయిపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు దర్యాప్తులో ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. కాగా ఈ వివాదంపై ఈశ్వర్ సాయి గతంలో స్పందిస్తూ.. తాను ఒత్తిడిలో తప్పు చేశానని అంగీకరించాడు. మాధురి తనకు కష్ట సమయంలో అండగా నిలిచిందని, తమ మధ్య కొంతకాలంగా సంబంధం ఏర్పడిందని కూడా అతను చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
Also Read : బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్న రవితేజ ‘ఇరుముడి’.. రూ.170 కోట్లతో రికార్డుల వర్షం









