Divorce :  ప్రముఖ రాపర్ బాద్‌షా, పంజాబీ నటి ఇషా రిఖీ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. పెళ్లైన కేవలం ఐదు నెలలకే ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. గత నెల రోజులుగా వీరి బంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ సోమవారం రాత్రి ఇద్దరూ విడాకుల విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. బాద్‌షా, ఇషా రిఖీ మార్చిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్‌గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఇద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒకే విధమైన ప్రకటనను పోస్ట్ చేశారు.

Also Read : ఈశ్వర్ సాయిపై కేసు.. పరువు తీశారంటూ మాధురి ఫిర్యాదు

నేను, ఇషా రిఖీ పరస్పర అంగీకారంతో విడిపోవాలని, ఇకపై మా దారుల్లో మేము ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయం ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవంతో తీసుకున్నదే. ఈ సమయంలో మా వ్యక్తిగత జీవితానికి, గోప్యతకు అందరూ గౌరవం ఇవ్వాలని కోరుతున్నాం అని బాద్‌షా తన ప్రకటనలో పేర్కొన్నాడు. తమ విడాకులపై ఇదే తమ ఏకైక ప్రకటన అని కూడా బాద్‌షా స్పష్టం చేశాడు. తమ సంబంధం గురించి ఇకపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని అభిమానులను, మీడియాను కోరాడు.

బాద్‌షా, ఇషా రిఖీ మధ్య సంబంధం సరిగా లేదనే వార్తలు జూలై నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అదే సమయంలో ఇషా రిఖీ తనకు, బాద్‌షాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బాద్‌షాకు ఇది రెండో వివాహం. అంతకుముందు ఆయన జాస్మిన్ మసీహ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరూ విడిపోయి 2020లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి జెస్సెమీ గ్రేస్ మసీహ్ సింగ్ అనే కుమార్తె ఉంది. ఆమె 2017 జనవరిలో జన్మించింది.

ఐదు నెలలకే బాద్‌షా, ఇషా రిఖీ విడాకులు ప్రకటించడం బాలీవుడ్, పంజాబీ సినీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే తమ విడిపోవడానికి అసలు కారణం ఏమిటనే విషయాన్ని మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు.

Also Read : బిగ్‌బాస్‌ హోస్ట్ గా సౌరభ్‌ గంగూలీ.. పదేళ్ల తర్వాత మళ్లీ!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.