USA-Venezuela : ఇరాన్‌, అమెరికాల మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్న వేళ అమెరికా-వెనెజువెలా మధ్య అతిపెద్ద చమురు డీల్‌ కుదిరింది. వెనెజువెలాలో ఉత్పత్తి అవుతున్న ఇంధనంలో 65 బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలపై నియంత్రణకు ఆ దేశంతో ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందం అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ మాట్లాడుతూ అగ్రరాజ్యంతో చేసుకున్న ఈ ఒప్పందంతో తమ దేశ పునరుద్ధరణతో పాటు, 17 చమురు క్షేత్రాల అభివృద్ధికి దోహడపడుతుందన్నారు. ఈ ఒప్పందం వల్ల దాదాపు 100 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : రంగు మారుతున్న నీరు.. నేపాల్ కు ముంచుకొస్తున్న మరో ముప్పు?

ఈ సందర్భంగా మెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ ఈ ఒప్పందం ఇరుదేశాలకు పెద్ద విజయమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల వెనెజువెలాకు బిలియన్ల కొద్దీ ప్రైవేట్ పెట్టుబడులను తీసుకువస్తుందన్నారు.. అలాగే అమెరికాలో గ్యాస్ ధరలు తగ్గడానికి దారితీస్తుందని తెలిపారు.వెనెజువెలా నుంచి కొనుగోలు చేసే చమురును వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను నింపడానికి, సైనిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని రూబియో తెలిపారు.

కాగా గత ఆరు నెలలుగా ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధం మూలంగా అమెరికాలో తీవ్ర చమురు కొరత ఏర్పడుతోంది. కాగా, ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్‌లో చాలాకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో గ్యాస్‌ రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గ్యాస్‌ నిల్వలు పెంచుకోవడానికి ట్రంప్‌ వెనెజువెలాపై దృష్టి సారించడం గమనార్హం. ప్రస్తుత ఒప్పందం ప్రకారం వెనెజువెలా ఉత్పత్తి చేసే చమురు ఉత్పత్తిలో కొంతమేర యాజమాన్య వాటాను కలిగిఉండటంతో పాటు అసలు ధరకే కొనుగోలు చేసే హక్కు అమెరికాకు లభిస్తోంది. అయితే ఈ ఒప్పందం కుదిరినప్పటికీ అమెరికాలో చమురు ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదు. దానితో పాటు వెనెజువెలా నుంచి చమురు వెలికి తీయడం వెంటనే జరగదని, దీనికి కొన్నేళ్లు పట్టొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read : అమెరికాలో హత్య చేసి ఇండియాకు పరారీ.. నిందితుడు అరెస్ట్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.