
Kishan Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సాగుతున్న వివాదం మరింత రాజుకుంది. తన పర్యటనను కావాలనే కేంద్రం అడ్డుకుందని రేవంత్ ఆరోపించగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆయన పర్యటనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండటమే కాకుండా భారత్‌పై విషం చిమ్మే న్యూయార్క్ మేయర్ మమ్దానీతో.. సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు భేటీ కావాలనుకున్నారో క్లారిటీ ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.అసలు ఆయన అమెరికాలో పర్యటించడానికి గల కారణాలు వెల్లడించాలని కిషన్ రెడ్డి కోరారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు. అసలు అనుమతులు లేకుండా ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారంటూ ఆయన సూటిగా ప్రశ్నించడం చర్చనీయంశమైంది. రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లుగా ఈ పర్యటన లేదని ఆక్షేపించారు.
Also Read : కృతి సనన్ యాడ్.. హీరోయిన్ కు రాహుల్ గాంధీ మద్దతు!
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనపై తాము కొత్తగా నిబంధనలేవి పెట్టలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్న నిబంధనలే తాము అమలు చేశామని స్పష్టం చేశారు. ఇది సాధారణ ప్రక్రియ.. ఇందులో రాజకీయాలకు తావు ఉండదన్నారు. భారత్‌పై ఎపుడు విషం చిమ్మే వ్యక్తి న్యూయార్క్ మేయర్ మామ్దానీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారంటూ వార్తలు వచ్చాయని తెలిపారు. ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అంటూ న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యనించిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి మామ్ధానీను ఎందుకు కలుస్తున్నారో.. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘పర్యటన షెడ్యూలు మీ స్థాయికి తగినట్లుగా లేదని’ విదేశాంగ శాఖ ముందే స్పష్టంచేసిందని, అయినా ఈ అంశంపై అధికారులతో చర్చించి క్లియరెన్స్ తీసుకోకుండా బయల్దేరిన సీఎం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు’ అని కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘2005లో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్నప్పడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. మోదీ మాత్రమే కాదు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది సీఎంలకు అనుమతులు ఇవ్వలేదు. ఇదంతా సాధారణ పరిపాలనా ప్రక్రియే తప్ప.. రాజకీయ అంశం కాదన్నారు. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ గతంలో కెనడా, రష్యా పర్యటనకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వలేదు’ అని గుర్తు చేశారు. విదేశీ యూనివర్సిటీలను తీసుకొస్తానని మాటలు చెబుతున్న సీఎం రాష్ట్రంలో విద్యావ్యవస్థను నాశనం చేశారని కిషన్‌రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ‘అధికారంలోకి రాగానే విద్యాశాఖకు 15% నిధులు కేటాస్తామన్న సీఎం ఆ సంగతే మర్చిపోయారన్నారు. విద్యార్థినీలకు స్కూటీలు, విద్యా భరోసా కార్డులు, మండలానికొక ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ ఇచ్చిన హామీలను విస్మరించారు’ అని కిషన్ రెడ్డి ఆరోపించారు. సెప్టెంబరు 2 నాటికి రేవంత్‌రెడ్డి పాలనకు 1,000 రోజులు పూర్తవుతుందని, ఈ కాలంలో తెలంగాణకు ఏం చేశారో సీఎం చెప్పాలని కేంద్ర మంత్రి నిలదీశారు.
Also Read : కొండా సురేఖ బిడ్డ అని ఊరుకుంటున్నాం.. లేకపోతేనా : జగ్గారెడ్డి సంచలన కామెంట్స్!









