Donald Trump
Donald Trump

BIG BREAKING :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేయాలనే వ్యూహంలో భాగంగా, అమెరికాలో పుట్టే పిల్లలకు ఇచ్చే పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని (బర్త్‌ రైట్‌ సిటిజన్‌షిప్‌) రద్దు చేయాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చట్టం దేశంలో యథాతథంగా కొనసాగాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అమెరికా భూభాగంలో జన్మించిన ఎవరికైనా సహజంగానే పౌరసత్వం లభించే దశాబ్దాల నాటి చట్టాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారు. అందుకోసం ఆయన ఒక ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను కూడా జారీ చేశారు. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని, జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమెరికా సుప్రీంకోర్టు పూర్తిగా వ్యతిరేకించింది. రాజ్యాంగబద్ధంగా వస్తున్న పౌరసత్వ హక్కును కాలరాయడం కుదరదని తేల్చి చెప్పడంతో ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో గట్టి షాక్ తగిలినట్లయింది. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న లక్షలాది మంది వలసదారులకు, భారతీయులకు ఈ తీర్పు పెద్ద ఉపశమనం కలిగించింది.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.