
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమానం కేవలం ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగించేది కాదు. అది గాల్లో తేలియాడే ఒక మిలిటరీ కమాండ్ సెంటర్. భారతదేశంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం పుతిన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. అయితే పుతిన భారత్‌కు వచ్చిన ఫ్లైట్ శత్రువుల కంటికి చిక్కదని అంటున్నారు. ఇంతకీ ఆ ఫ్లైట్ ఏది? దాని స్పెషాలిటీ ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
మాస్కో నుంచి న్యూఢిల్లీ వరకు పుతిన్ ప్రయాణం కోసం రష్యా భద్రతా దళాలు ఒకే రకమైన రెండు IL-96-300PU విమానాలను ఉపయోగించాయి. రంగు, పరిమాణం, డిజైన్, చివరకు విమానంపై ఉన్న అక్షరాలతో సహా రెండూ అచ్చం ఒకేలా ఉంటాయి. విమానయాన భాషలో ఈ వ్యూహాన్ని డికాయ్ ఫ్లైట్ అని పిలుస్తారు. అంటే ఒక విమానంలో అధ్యక్షుడు స్వయంగా ప్రయాణిస్తుంటే మరొకటి శత్రువులను దారి మళ్లించడానికి ఆయనతో పాటే ప్రయాణిస్తుంది.
Also Read : పండుగల ఎఫెక్ట్.. ఒకే రోజు 20 లక్షల టికెట్లు.. IRCTC ఆల్ టైమ్ రికార్డు!
ఈ రెండు విమానాలు ఆకాశంలో పక్కపక్కనే, ఒకే ఎత్తులో, ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. శత్రువులు దాడి చేయాలన్నా లేదా దారిలో పుతిన్ ఏ విమానంలో ఉన్నారో తెలుసుకోవాలన్నా ఇది ఒక అసాధ్యమైన సవాలుగా మారుతుంది. పుతిన్ ఏ విమానంలో ప్రయాణిస్తున్నారో కేవలం ఆయనకు నమ్మకమైన భద్రతాధికారులకు మాత్రమే తెలుస్తుంది. తప్ప వేరే ఏ అంతర్జాతీయ సంస్థకూ తెలియదు.
ఈ రెండు విమానాలు (RSD221, RSD369) ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశంలో చిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకర్లు, రాడార్ల నుండి తప్పించుకోవడానికి ఈ విమానాల్లోని రేడియో సిగ్నళ్లను ప్రతి కొన్ని నిమిషాలకు మార్చి మార్చి ఆన్-ఆఫ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల రాడార్ స్క్రీన్లపై ఒకసారి ఒక విమానం కనిపిస్తే, మరుసటి నిమిషంలో అది మాయమై రెండో విమానం ప్రత్యక్షమవుతుంది. ఇది కొత్త ప్రయోగం ఏమీ కాదు. గతంలో పుతిన్ కజకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇదే తరహా డబుల్ షీల్డ్ ప్రోటోకాల్‌ను అమలు చేశారు. అత్యంత తక్కువ వ్యవధిలో రాడార్ డేటాను మారుస్తూ శత్రు దేశాల నిఘా వర్గాలకు మైండ్ బ్లాక్ చేయడం రష్యన్ సెక్యూరిటీ నెట్‌వర్క్‌కు వెన్నతో పెట్టిన విద్య.
పుతిన్ ప్రయాణించే ఈ ప్రత్యేక IL-96-300PU విమానాన్ని ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ అని కూడా పిలుస్తారు. రష్యా వద్ద ఇటువంటి ప్రత్యేక విమానాలు మొత్తం నాలుగు ఉన్నాయి. ఇది సాధారణ విమానాల కంటే ఎన్నో రెట్లు భిన్నమైనది, సురక్షితమైనది. రష్యా అధ్యక్షుడి అత్యంత శక్తివంతమైన అణు ఆయుధాల నియంత్రణ వ్యవస్థ ఈ విమానంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, గాల్లో ప్రయాణిస్తున్నా కూడా పుతిన్ ఇక్కడి నుంచే నేరుగా అణు దాడులను ఆదేశించగలరు. ఈ విమానానికి అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలు అమర్చబడి ఉన్నాయి. శత్రువులు ప్రయోగించే రాడార్ లేదా లేజర్ గైడెడ్ క్షిపణులను గాల్లోనే దారి మళ్లించే లేదా ధ్వంసం చేసే సాంకేతికత దీనికి ఉంది. దీని ఇంధన ట్యాంక్ పరిమాణం చాలా పెద్దది. ఒక్కసారి పూర్తిస్థాయిలో ఇంధనం నింపితే, మధ్యలో ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. శాటిలైట్ ఫోన్లు, అత్యంత క్లిష్టమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా గాల్లో నుంచే సైనిక కమాండర్లతో నేరుగా మాట్లాడవచ్చు.
Also Read : పగలు TV యాంకర్.. రాత్రైతే అదే పని.. ఆమెకు ఉరిశిక్ష..!









