Baby Rescued : నేపాల్‌లో సంభవించిన ఆకాల వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు వందలాది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. అయినా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు వెయ్యి మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ అంతకంటే ఎక్కువమందే ఉంటారని భావిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆఫరేషన్‌ కొనసాగుతుంది. కాగా ఈ ఆఫరేషన్‌ లో నెలన్నర చిన్నారి శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడటం అద్భుతంగా నిలుస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలోని రసువా జిల్లాలో వరద ఉధృతికి చిక్కుకుపోయిన ఒక నెలన్నర (45 రోజులు) వయసున్న పసిపాపను నేపాల్ ఆర్మీ సిబ్బంది అత్యంత సురక్షితంగా రక్షించారు. ఆ చిన్నారిని సురక్షిత ప్రాంతంలోని ధుంచే క్యాంపునకు తరలించారు.

Also Read : నేపాల్ వరదలు.. నీటి ఉధృతిని తట్టుకుని నిలబడ్డ ఇల్లు! కారణం ఏంటో తెలుసా?

చిన్నారితో పాటు ఫ్యామిలీని కూడా రక్షించినట్లు అర్మీ అధికారులు ప్రకటించారు. నేపాల్ ఆర్మీ, పోలీసుల జాయింట్ ఆపరేషన్లో పాపతో పాటు ఆమె ఫ్యామిలీని రక్షించి క్యాంపునకు తరలించినట్లు రెస్క్యూటీమ్ తెలిపింది.. ఆ పసికందు ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉందని తెలిపింది. తీవ్ర వినాశనం సృష్టించిన ఈ వరదల మధ్య ఈ చిన్నారి ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతంగా నిలిచిందని సిబ్బంది తెలిపారు. పసికందును చూసి సహాయక సిబ్బంది భావోద్వేగానికి గురైయ్యారు.

అలాగు మరో ఘటనలో రసువా ప్రాంతంలోనే వరద మట్టి, శిథిలాల కింద దాదాపు 60 గంటల పాటు చిక్కుకుపోయిన రెండు సంవత్సరాల పాపను రెస్క్యూ టీమ్ సజీవంగా వెలికితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అలాగే వరదల్లో చిక్కుకున్న కవల పిల్లలను నేపాల్ సైన్యం సురక్షితంగా రక్షించి, వారికి అవసరమైన సపర్యలు చేసిన దృశ్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ జలప్రళయం నేపాల్‌లో తీవ్ర నష్టాన్ని మిగిల్చినప్పటికీ, ఇలాంటి చిన్న పిల్లలు ప్రాణాలతో బయటపడటం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారికి సరికొత్త ఆశను, ధైర్యాన్ని ఇస్తోంది. వరద ముంపు ఉన్నప్పటికీ సిబ్బంది సకాలంలో స్పందించి పసిపాపను కాపాడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఇరాన్‌లో లక్ష మందికి పైగా ఉద్యమకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.