
నేపాల్‌లో మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వరదలు పెరిగి కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గత నెల వచ్చిన ఆకస్మిక వరదలతో ఇప్పటివరకూ దాదాపు 1,453 మంది ప్రాణాలు కోల్పోగా.. 5 వేల మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో మట్టి దిబ్బలు పడిపోవడం, నదులు ఉప్పొంగి ప్రవహించడంతో ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. పల్లపు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత నెల నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదల వల్ల విపరీతమైన నష్టం జరిగింది. ఆ వరదల్లో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోగా.. మిస్సింగ్ అయ్యారు.
Also Read : యూఏఈలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రహస్య పర్యటన.. కారణమిదే!
A government office building in the hills of western #Nepal fell into the flooded river after heavy rain washed away the ground beneath it. Roads in the area are also blocked by landslides.
pic.twitter.com/jWhVjrlQuE— Abhishek Jha (@abhishekjha157) September 27, 2026
బాధితుల కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగానే మళ్లీ కొత్తగా వర్షాలు పడటంతో అక్కడ పరిస్థితి మరింత దిగజారింది. వీటితో పాటు మనంగ్ జిల్లాలోని హిమ్లంగ్ హిమల్ పర్వత ప్రాంతంలో దారుణమైన హిమపాతం సంభవించింది. మంచు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో 10 మంది గల్లంతయ్యారు. ఒకవైపు నీటి వరదలు, మరోవైపు మంచు ప్రమాదాలతో నేపాల్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను రక్షించేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వరద తాకిడికి రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షాల తీవ్రత తగ్గకపోతే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. అంతిమ యుద్ధానికి మేం సిద్ధమంటూ ఇరాన్ సంచలన ప్రకటన
🇮🇳🇳🇵 At least 19 people have been killed as severe flooding and landslides hit India and Nepal, while 10 workers remain missing after an avalanche in the Himalayas.
It comes as India’s Uttar Pradesh recorded 19 times its normal rainfall in just 24 hours, killing 15 people and…
— Mario Nawfal (@MarioNawfal) September 27, 2026









