Francis Halzen : ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని ఫ్రాన్సిస్ హాల్జెన్ గెలుచుకున్నారు. ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి చేసిన కృషితో పాటు, అంతరిక్షం నుంచి వచ్చే అధిక శక్తి న్యూట్రినోలను గుర్తించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో పరిశోధకులు, ఇంజినీర్ల బృందానికి హాల్జెన్ నాయకత్వం వహించారు. ఆయన కృషితో ఎంతో ప్రత్యేకమైన పరిశోధనా పరికరం అందుబాటులోకి వచ్చిందని నోబెల్ ఫిజిక్స్ కమిటీ చైర్మన్ మార్క్ పియర్స్ తెలిపారు. హాల్జెన్ పట్టుదల, శాస్త్రీయ ఆలోచన కొత్త రకం ఖగోళ పరిశోధనకు మార్గం చూపాయని చెప్పారు.

బెల్జియంలో జన్మించిన 82 ఏళ్ల ఫ్రాన్సిస్ హాల్జెన్ ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆయనను సంప్రదించేందుకు అసోసియేటెడ్ ప్రెస్ చేసిన ప్రయత్నాలు వెంటనే ఫలించలేదు. దక్షిణ ధ్రువం వద్ద న్యూట్రినోలను గుర్తించే ప్రయత్నాలను హాల్జెన్ 1980ల నుంచే చేస్తున్నారు. ఆయన పరిశోధనల్లో న్యూట్రినోలను గుర్తించడం కీలక అంశంగా ఉంది.

Also Read : రష్యా ల్యాబ్‌లో పగిలిన టెస్ట్ ట్యూబ్.. లీకైన ప్లేగు బ్యాక్టీరియా.. ఆందోళనలో ప్రజలు

ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టాక్‌హోమ్‌లో ప్రకటించింది. ఈ ఏడాది నోబెల్ బహుమతి కింద 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు, అంటే సుమారు 1.2 మిలియన్ డాలర్లు అందజేస్తారు. అవార్డు ఒక వ్యక్తికి, కొంతమంది విజేతల బృందానికి లేదా సంస్థకు దక్కినా ఇదే మొత్తం ఉంటుంది.

గత ఏడాది ఫిజిక్స్‌లో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. క్వాంటమ్ టన్నెలింగ్ అనే ప్రక్రియపై వారి పరిశోధనలకు ఈ అవార్డు దక్కింది. ఈ పరిశోధనలు ఎంఆర్ఐ యంత్రాల్లో అత్యంత సున్నితమైన కొలతలకు ఉపయోగపడ్డాయి. అలాగే మెరుగైన మొబైల్ ఫోన్లు, వేగవంతమైన కంప్యూటర్ల అభివృద్ధికి కూడా ఈ పరిశోధనలు ఉపయోగపడ్డాయి.

ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనలు సోమవారం మెడిసిన్ అవార్డుతో ప్రారంభమయ్యాయి. మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంలో ఉపయోగపడే కాంతి ఆధారిత పరిశోధనా పద్ధతిని అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు మెడిసిన్ నోబెల్ దక్కింది. బుధవారం కెమిస్ట్రీ నోబెల్, గురువారం సాహిత్య నోబెల్ ప్రకటించనున్నారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. వచ్చే సోమవారం నోబెల్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ విజేతను ప్రకటించనున్నారు.

Also Read : ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళన.. 500 స్కూళ్లు బంద్ 4,000 మంది అరెస్ట్.. కారణమిదే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.