ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారతదేశం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ను అత్యంత వేగంగా దేశవ్యాప్తంగా విస్తరించిన భారత్.. ఇప్పుడు అంతకంటే వేగవంతమైన ‘6జీ’ సాంకేతికతను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్‌లో దాదాపు 30 వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని, అలాగే అతి త్వరలోనే దేశంలో 6జీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు.

Also Read : కరూర్ తొక్కిసలాటలో రాజకీయ కుట్ర..సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు:

మనం ప్రస్తుతం వాడుతున్న 5జీ నెట్‌వర్క్ కంటే 6జీ సాంకేతికత దాదాపు 100 రెట్లు వేగంగా ఉంటుంది. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ ఊహించని రేంజ్‌లో పెరుగుతుంది. ఉదాహరణకు ఒక పూర్తి హై-క్వాలిటీ సినిమాను కేవలం ఒక్క సెకను లేదా అంతకంటే తక్కువ సమయంలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్‌డ్ రోబోలు, డ్రైవర్ లేని కార్లు, హోలోగ్రామ్ కాలింగ్ లాంటి సరికొత్త టెక్నాలజీలు రన్ అవ్వడానికి ఈ 6జీ ఇంటర్నెట్ మారుతుంది.

ఒకప్పుడు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్.. ఈరోజు సొంతంగా తయారు చేసే స్థాయికి ఎదిగింది. గత 12 ఏళ్లలో ‘మేక్ ఇన్ ఇండియా’ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా మారిందని మోదీ గర్వంగా చెప్పారు. మన దేశంలో తయారవుతున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, కార్లు మరియు మందులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరుకుంటున్నాయి. చిప్‌ల నుంచి షిప్‌ల వరకు అన్నింటా భారత్ తయారీ కేంద్రంగా ఎదుగుతుందన్నారు.

Also Read : నేడు ఈ రాశి వారికి పట్టనున్న అదృష్టం.. పొరపాటున ఈ మిస్టేక్స్ చేశారనుకోండి.. అంతే సంగతులు!