
Nepal floods : నేపాల్ విలయం ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. వేలాది మంది ప్రజలు, టూరిస్టులు గల్లతంతయ్యారు. వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 700 వరకు మృతదేహాలను వెలికి తీశారు. ఇప్పటికీ ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇండ్లు కూలిపోయి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీనికోసం పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో శిథిలాలను తొలగిస్తు్న్న సహాయక సిబ్బందికి గుండేలు పిండేసే ఘటన ఎదురైంది. మూడు రోజులుగా ఒక ఆరేళ్ల పాప మట్టి శిథిలా క్రింద చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్న దృశ్యం వారి కంటపడింది. దీంతో తీవ్రంగా శ్రమించిన సిబ్బంది ఆ పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
🚨This video from Timure, Rasuwa is hard to watch and harder to look away from.
A 6-year-old girl (Shirganga Ichaimagar) was found alive under soil and corrugated sheets days after the Bhote Koshi flash flood tore through the area. Rescuers heard her crying and dug her out. They…
— Louis Montoya (@montoyalouis1) August 29, 2026
రుసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో సాయుధ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. శిథిలాల కింద నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది మట్టి, శిథిలాలను జాగ్రత్తగా తొలగించారు. ఆ శిథిలాల కింద చిక్కుకుపోయిన పాపను గుర్తించి సహాయక సిబ్బంది వెలికితీశారు.పూర్తిగా మట్టితో నిండుకున్న చిన్నారిని జాగ్రత్తగా బయటకు తీసి ఒంటిపై పేరుకుపోయిన మట్టిని తొలగించి పాప పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కాఠ్మాండూ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడా చిన్నారి ఆసుపత్రిలో కోలుకుంటోంది. కాగా, ఈ ఘోరకలి అనంతరం శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారు ఇంకా సజీవంగా ఉండొచ్చనే ఆశతో సహాయక సిబ్బందితో పాటు ప్రజలు కూడా మట్టిదిబ్బలు, శిథిలాలను తొలగించి వెతుకుతున్న దృశ్యాలు అందరినీ కంట తడిపెట్టిస్తున్నాయి.
కాగా అనుకోని వరదల వల్ల నేపాల్, టిబెట్లలో కలిపి సుమారు 3,000మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని అధికారులు తేల్చేశారు. అలా గల్లంతైన వారిలో 540 మంది విదేశీయులు ఉండగా.. వారిలో చాలామంది మానస సరోవర్ యాత్రకు వచ్చిన భారతీయులేనని సంబంధిత వర్గాలు వెల్లడించారు. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వర్షం, పొగమంచు, వరదలు కొనసాగుతున్నాయి. దీంతో హాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు భారత్కు చెందిన 128మంది సమాచారం అందుబాటులో లేదని విదేశాంగ శాఖ (MEA) తెలిపింది. గత రెండు రోజుల్లో యాత్రకు వెళ్లినవారిలో 598మంది భారతీయులు చైనా నుంచి నేపాల్లోని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. మరో 900మంది చైనా సరిహద్దుల్లోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.









