
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన సీఎన్‌ఎన్ (CNN), ఎంఎస్‌ఎన్‌వోడబ్ల్యూ (MSNOW), పొలిటికో (POLITICO) వంటి అగ్రశ్రేణి వార్తా నెట్‌వర్క్‌ల ప్రతినిధులను వైట్‌హౌస్‌లోకి రాకుండా అధికారికంగా బ్యాన్(News Channels Ban) చేస్తూ ట్రంప్ సర్కార్ ఒక నోటీసు విడుదల చేసింది. అసలు ట్రంప్ అంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దానికి వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనే చర్చలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఈ నిషేధానికి గల కారణాలను ట్రంప్ వెల్లడించారు.
Also Read : భారతీయ టెకీలకు బిగ్ షాక్.. H-1B వీసా బాంబ్.. అమెరికా డ్రీమ్‌కి మళ్లీ ఆటంకమే!
ఈ మీడియా సంస్థలు నిరంతరం తన ప్రభుత్వంపై, తన పాలనపై కావాలని బురదజల్లుతున్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా అమెరికా దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై దిగజార్చేలా కావాలనే ‘ఫేక్ న్యూస్’ ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలను తారుమారు చేస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేందుకు కుట్రపూరిత కథనాలను అల్లుతున్నారని.. ఇలాంటి పక్షపాత వైఖరిని ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు. ఈ నిషేధ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
అయితే భవిష్యత్తులో నిజాలను దాచి, అసత్య ప్రచారాలు చేసే మరికొన్ని ప్రముఖ మీడియా నెట్‌వర్క్‌లపై కూడా ఇదే తరహా ‘సర్జికల్ స్ట్రైక్’ ఉండే అవకాశం ఉందని ఆయన సూచనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ఏ సంస్థనూ విడిచిపెట్టబోమని సంకేతాలు ఇవ్వడంతో గ్లోబల్ మీడియా వర్గాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ట్రంప్ తీసుకున్న ఈ మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండు భిన్నమైన వాదనలకు దారితీసింది. ఒక దేశ అధ్యక్షుడు ఈ స్థాయిలో అగ్రశ్రేణి పత్రికలను, ఛానెళ్లను వైట్‌హౌస్ నుంచి నిషేధించడం ప్రజాస్వామ్యానికి, భావప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతమని ఒక వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. అయితే వార్తల పేరుతో నిరంతరం ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే పక్షపాత మీడియాకు ముకుథాడు వేయడానికి ఇది సరైన, ధైర్యవంతమైన నిర్ణయమని మరొక వర్గం గట్టిగా సమర్థిస్తోంది.
Also Read : జిన్ పింగ్ ఇండియాలో స్ట్రోక్ కు గురయ్యారా?









