
H1B -Visa Application Fee : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులను నియమించుకునే హెచ్-1బీ వీసా దరఖాస్తులపై విధించిన భారీ లక్ష డాలర్ల అత్యధిక ఫీజు నిబంధనను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆయన తాజాగా కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇప్పటికే బోస్టన్తో పాటు పలు ఫెడరల్ కోర్టులలో ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత, న్యాయపోరాటం నడుస్తోంది. అయినా కూడా ట్రంప్ సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేసేందుకు రెడీ కావడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
గతంలో ఐటీ సంస్థలు హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ కోసం కేవలం 2,000 నుంచి 5,000 డాలర్ల వరకు మాత్రమే వెచ్చించేవి. అయితే గతేడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ఊహించని విధంగా ఈ రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి ఒక్కసారిగా బాంబు పేల్చింది. ఈ పెంపు అమల్లోకి వచ్చినప్పటి నుండి ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీల వీసా రిజిస్ట్రేషన్లు ఏకంగా 92 శాతం మేర పడిపోయాయని అమెరికా పాలనా వర్గాలు వెల్లడించాయి.
Also Read : సౌదీ పైప్‌లైన్‌పై దాడి.. భారత్‌కు చమురు షాక్.. పాక్ మిలటరీ ఎంట్రీ వెనుక బిగ్ ట్విస్ట్!
తక్కువ వేతనాలతో విదేశీ నిపుణులను తీసుకురావడం తగ్గించి.. అత్యంత అత్యున్నత నైపుణ్యం ఉన్న వారిని మాత్రమే కంపెనీలు ఎంపిక చేసుకునేలా ఒత్తిడి తీసుకురావడం, తద్వారా అమెరికన్ గ్రాడ్యుయేట్లు, స్థానిక కార్మికులకు ఉద్యోగ అవకాశాలు పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది.అయితే ఈ కఠినమైన నియమావళిలో కొన్ని ప్రత్యేక వి మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలోనే ఉంటూ విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ భారీ రుసుము వర్తించదు.
అదేవిధంగా దేశం విడిచి బయటకు వెళ్లకుండానే అంతర్గతంగా వీసా స్టేటస్ మార్చుకునే అభ్యర్థులకు కూడా ఈ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. కానీ భారత్ వంటి విదేశాల నుండి నేరుగా అమెరికా ఉద్యోగాల కోసం ప్రయత్నించే నూతన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులపై మాత్రం ఈ భారీ ఆర్థిక భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది.అమెరికా హెచ్-1బీ వీసాల ప్రయోజనం పొందే వారిలో సింహభాగం భారతీయ టెక్కీలే కావడం వల్ల ఈ పొడిగింపు నిర్ణయం ఇండియన్ ఐటీ పరిశ్రమతో పాటు డాలర్ కలలు కంటున్న వేలాది మంది యువ ఇంజనీర్లకు బిగ్ షాక్‌గా మారింది.
Also Read : డెంగ్యూ డేంజర్‌కు ఎండ్ కార్డ్.. 2027లో భారత్‌లోకి రాబోతున్న సైలెంట్ కిల్లర్ వ్యాక్సిన్ క్యూడెంగా!









