
EXPLAINER : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దేశం అమెరికా. advanced weapons, వేలాది విమానాలు, ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ బేస్‌లు ఉన్నా.. ఇప్పుడు అమెరికాను కొత్త టెన్షన్ వెంటాడుతోంది. అదేదో సైనికులు, ఫైటర్ జెట్ల కొరత కాదు.. మిస్సైల్ ఇంటర్‌సెప్టర్ల షార్టేజ్. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా Patriot, THAAD వంటి కీలక ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలను భారీగా వినియోగించడంతో వాటి నిల్వలు తగ్గిపోయాయి. మరి ఈ కొరత అమెరికాకు ఎంత పెద్ద సవాల్‌గా మారింది..? చైనాతో యుద్ధం వస్తే అమెరికా పరిస్థితి ఏంటి..? ఈ పరిణామాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి..? ఈ స్టోరీలో క్లియర్‌గా తెలుసుకుందాం.
యుద్ధంలో శత్రువుపై దాడి చేయడం ఒక ఎత్తైతే.. శత్రువు దాడిని అడ్డుకోవడం మరొక ఎత్తు. ఇరాన్ బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులకు దిగినప్పుడు.. అమెరికా తన మిలిటరీ బేస్‌లు, సైనికులను కాపాడుకోవడానికి భారీగా Patriot, THAAD ఎయిర్‌డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లను ఉపయోగించింది. ఇక్కడే అమెరికాకు అసలు సమస్య మొదలైంది. యుద్ధంలో ఇరాన్ తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేస్తే.. వాటిని అడ్డుకోవడానికి అమెరికా భారీ ఖర్చయ్యే ఇంటర్‌సెప్టర్లను వినియోగించింది. ఇలా యుద్ధం కొనసాగుతున్న కొద్దీ.. అమెరికా దగ్గర ఉన్న కీలకమైన డిఫెన్స్ మిస్సైళ్ల నిల్వలు క్రమంగా తగ్గిపోయాయి.
Also Read : పాకిస్తాన్ లో కాక్రోచ్ పార్టీ…మెరుగైన పరిపాలన, పారదర్శక రాజకీయమే ఎజెండా
అమెరికా ఎయిర్ డిఫెన్స్‌లో Patriot, THAAD రెండూ కీలకమైన వ్యవస్థలు. Patriot ఇంటర్‌సెప్టర్.. బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లు, విమానాలను లక్ష్యాన్ని చేరకముందే వాటిని గాల్లోనే అడ్డుకుంటుంది. THAAD మాత్రం మరింత ఎత్తులో వచ్చే బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకునే మరో రక్షణ కవచం. ఇరాన్‌తో యుద్ధంలో వీటిని భారీగా వినియోగించడంతో నిల్వలు గణనీయంగా తగ్గాయి. Center for Strategic and International Studies- CSIS అంచనా ప్రకారం… యుద్ధానికి ముందున్న నిల్వలతో పోలిస్తే అమెరికా వద్ద Patriot నిల్వలు 65 శాతం తగ్గాయి. ప్రస్తుతం అమెరికా దగ్గర 1,000 కంటే తక్కువ Patriot ఇంటర్‌సెప్టర్లు ఉన్నాయని CSIS చెబుతోంది. THAAD ఇంటర్‌సెప్టర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గి సుమారు 250కి చేరింది. దీంతో అమెరికా తన ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని కొనసాగించడంతో పాటు.. ఖర్చైన ఇంటర్‌సెప్టర్లను వీలైనంత వేగంగా తిరిగి భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే అమెరికా దగ్గర ఆయుధాలు పూర్తిగా అయిపోయాయని CSIS చెప్పడం లేదు. ఇరాన్‌తో ఘర్షణను కొనసాగించేంత సైనిక సామర్థ్యం ఇంకా ఉంది. కానీ అసలు సమస్య ఆయుధాలు ఉన్నాయా లేదా అనేది కాదు.. ఎన్ని ఉన్నాయి..? వాటిని ఎంత వేగంగా తిరిగి తయారు చేయగలం..? అనేదే important. ఎందుకంటే యుద్ధంలో ఒక ఇంటర్‌సెప్టర్‌ను ప్రయోగించడం కొన్ని సెకన్లలో జరిగిపోవచ్చు. కానీ దాని స్థానంలో మరో ఇంటర్‌సెప్టర్‌ను తయారు చేసి నిల్వల్లోకి తీసుకురావడానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. ఇదే ఇప్పుడు అమెరికాకు అసలు సవాల్‌గా మారింది.
అయితే ఇప్పుడు అమెరికా ముందున్న అసలు ముప్పు ఇరాన్ ఒక్కటే కాదు.. చైనా కూడా. ముఖ్యంగా వెస్ట్రన్ పసిఫిక్‌లో తైవాన్ విషయంలో చైనాతో యుద్ధం మొదలైతే.. అమెరికాకు భారీ స్థాయిలో ఎయిర్ డిఫెన్స్ అవసరం అవుతుంది. మిస్సైల్ దాడులను అడ్డుకోవడంతో పాటు.. మిలిటరీ బేస్‌లు, నేవీ, ఎయిర్‌ఫోర్స్, మిత్రదేశాలను కూడా కాపాడాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో Patriot, THAAD వంటి కీలక ఇంటర్‌సెప్టర్ల నిల్వలు తక్కువగా ఉంటే.. అమెరికా సైనిక సన్నద్ధత, వ్యూహాత్మక సామర్థ్యంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
Also Read : మైక్రోసాఫ్ట్ సరికొత్త చరిత్ర.. ఒక్కరోజే రూ.42 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ విలువ
అందుకే అమెరికా ఆయుధ ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది. Patriot PAC-3 MSE ఇంటర్‌సెప్టర్ల తయారీ కోసం ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్‌తో 58.6 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 2026 నుంచి 2032 వరకు కొనసాగే ఈ ఒప్పందంతో.. 2030 నాటికి Patriot మిస్సైళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొత్త మిస్సైళ్ల తయారీ అంత ఈజీ కాదు. Raw materials, Electronic components, engines, గైడెన్స్ సిస్టమ్స్‌తో పాటు సమయం కూడా అవసరం. CSIS అంచనా ప్రకారం.. తగ్గిపోయిన మిస్సైల్ నిల్వలను పూర్తిగా పునరుద్ధరించడానికి అమెరికాకు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అంటే యుద్ధంలో ఖర్చైన ఆయుధాలను వెంటనే భర్తీ చేయడం సాధ్యం కాదు.. ఇదే ఇప్పుడు అమెరికాకు అసలు సవాల్‌గా మారింది.
ఇక దీని ప్రభావం మిత్రదేశాలపైనా పడొచ్చు. అమెరికా తన కోసం మాత్రమే ఆయుధాలు తయారు చేయడం లేదు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు సహా మిత్రదేశాలకు కూడా వివిధ రకాల ఆయుధ వ్యవస్థలను అందిస్తోంది. ఇప్పుడు అమెరికా ముందు రెండు పెద్ద అవసరాలు ఉన్నాయి.. ఒకవైపు తన సొంత ఆయుధ నిల్వలను తిరిగి నింపుకోవాలి.. మరోవైపు మిత్రదేశాల అవసరాలను కూడా తీర్చాలి. దీంతో ఆయుధ ఉత్పత్తిపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఒకవేళ అమెరికా ముందుగా తన నిల్వలకే ప్రాధాన్యత ఇస్తే.. మిత్రదేశాలకు ఆయుధాల సరఫరాలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది.
మరి దీని వల్ల ఇండియాకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా మిస్సైల్ నిల్వలు తగ్గడం వల్ల భారత్‌కు తక్షణ ముప్పు లేదు. కానీ చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తత పెరిగితే.. ఇండో-పసిఫిక్‌లో భారత్‌పై వ్యూహాత్మక ప్రభావం పడొచ్చని experts చెబుతున్నారు. మరోవైపు Patriot, THAAD వంటి ఆయుధాలకు డిమాండ్ పెరిగితే.. సరఫరా ఆలస్యం, ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉంది. మొత్తంగా.. యుద్ధంలో ఆయుధాల సంఖ్యతో పాటు వాటిని ఎంత వేగంగా భర్తీ చేయగలమన్నదే కీలకం.
మొత్తంగా ఇరాన్-అమెరికా యుద్ధం ప్రపంచానికి ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. యుద్ధంలో బలం అంటే కేవలం ఆయుధాలు ఉండటం కాదు.. వాటిని ఎంత వేగంగా భర్తీ చేయగలమన్నదే అసలు బలం. అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్నా.. ఇంటర్‌సెప్టర్ల నిల్వలు తగ్గడం కొత్త సవాల్‌గా మారింది. మరి ఇప్పుడు అమెరికా నెక్ట్స్ స్టెప్ ఏంటి..? ఆయుధ నిల్వలను ఎంత వేగంగా భర్తీ చేస్తుంది..? అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిందే.









