
అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ అరుదైన రికార్డు సాధించారు. అగ్రరాజ్యం అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా.. డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో కూడిన సరికొత్త బంగారు నాణేన్ని ముద్రించే అధికారిక ప్రక్రియను యూఎస్ టంకశాల (మింట్) అధికారికంగా ప్రారంభించింది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ ప్రత్యేకమైన గోల్డ్ కాయిన్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు.
Also Read : హోర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం: గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్ రెడీ!
As America commemorates 250 years of independence, the @usmint will begin striking this new $1 gold coin to honor the enduring legacy of liberty and a lasting symbol of patriotism. Featuring President Trump, it celebrates the strength of American values, and the promise of a… pic.twitter.com/PEMrsGqOEA
— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) July 15, 2026
ఈ సరికొత్త బంగారు నాణెం అమెరికా సాధించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు, ఆ దేశం ప్రపంచవ్యాప్తంగా చాటిన శాశ్వత వారసత్వానికి అత్యున్నత చిహ్నంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రకటన చేయడమే కాకుండా, శ్వేతసౌధం ఆమోదించిన ఆ ప్రత్యేక ఒక డాలర్ ముఖ విలువ కలిగిన బంగారు నాణెం అధికారిక ‘ఫస్ట్‌లుక్’ను ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ నాణెం నెట్టింట వైరల్ అవుతోంది.
TRUMP COIN! 🪙🇺🇸 pic.twitter.com/NbFuLekP1L
— The White House (@WhiteHouse) July 15, 2026
సాధారణంగా అమెరికా చరిత్రలో దేశాన్ని నిర్మించిన మాజీ అధ్యక్షులు లేదా చారిత్రక వ్యక్తుల జ్ఞాపకార్థం మాత్రమే ఇలాంటి ప్రత్యేక నాణేలను ముద్రిస్తుంటారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు అధికారంలో ఉండగానే నాణెం నిర్మించడం తొలిసారి. ఈ నాణేన్ని అత్యంత నాణ్యమైన స్వచ్ఛమైన బంగారంతో, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రత్యేక డిజైన్‌తో రూపొందిస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే ఈ నాణేలను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో, చరిత్రలో ఈ మైలురాయి ఎప్పటికీ నిలిచిపోతుందని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి.
Also Read : ‘యూనిఫాం విప్పేసి, పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయండి’ – పాక్ ఆర్మీ చీఫ్ కు మౌలానా ఫజలూర్ బహిరంగ సవాల్









