
Earthquake: పశ్చిమ ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంపం భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం కహ్రిజ్ నగరానికి పశ్చిమంగా సుమారు 54 కిలోమీటర్ల దూరంలోనూ, జవాన్‌రుడ్ నగరానికి దక్షిణంగా 33 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నట్లు గుర్తించారు. సుమారు 7 లక్షల 66 వేల జనాభా ఉన్న కహ్రిజ్, దాదాపు 38 వేల 600 జనాభా ఉన్న జవాన్‌రుడ్ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : FIFA World Cup : ఫిఫా చరిత్రలో సరికొత్త అధ్యాయం: ప్రపంచకప్ విజేతలకు ‘ఛాంపియన్‌షిప్ రింగ్స్’!
34 min. ago a 5.2 magnitude earthquake has hit Kermanshah Province, Iran (Javānrūd, Iran (27 km S)) https://t.co/o7uY5ApAts pic.twitter.com/hyLNi5tseu
— Ma (@mahanthanut) July 20, 2026
Also Read : పాకిస్థాన్‌లో ఘనంగా జగన్నాథుని రథయాత్ర.. వేలాది మంది భక్తుల సమక్షంలో!









