TG TET Results 2026 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET-2026) ఫలితాలను జులై 13 (సోమవారం) మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌ నికోలస్‌ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షల్లో 43.94 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌ 16 నుంచి 22 వరకు మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్షలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించారు. ఈ టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,15,028 మంది (74.81%) పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో మొత్తం 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

Also Read : పచ్చి పాలపై సంచలన నివేదిక: ఒక పొంగుతో దించితే రోగాలే..

కేటగిరీల వారీగా ఫలితాలు

కమ్యూనిటీల వారీగా పరిశీలిస్తే, ST అభ్యర్థులు 51.03 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచారు.

BC అభ్యర్థులు: 40.36% ఉత్తీర్ణత

EWS అభ్యర్థులు: 22.43% ఉత్తీర్ణత

జనరల్ కేటగిరీ: 20.15% ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాల్లో మహిళల ప్రతిభ & ట్రాన్స్‌జెండర్ల ప్రాతినిధ్యం
మెరుగైన ప్రతిభ: ఈ ఫలితాల్లో పురుషుల కంటే మహిళా అభ్యర్థులే అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.

పేపర్-II (మ్యాథ్స్ & సైన్స్): ఈ విభాగంలో 32,555 మంది మహిళలు హాజరుకాగా 12,495 మంది, 11,567 మంది పురుషులు హాజరుకాగా 5,488 మంది క్వాలిఫై అయ్యారు.

పేపర్-II (సోషల్ స్టడీస్): ఈ విభాగంలో 23,008 మంది మహిళలు పరీక్ష రాయగా 5,009 మంది అర్హత సాధించారు.

ట్రాన్స్‌జెండర్ల ఫలితాలు: పేపర్-I రాసిన నలుగురు ట్రాన్స్‌జెండర్లలో ఇద్దరు, పేపర్-II (మ్యాథ్స్) రాసిన ఆరుగురిలో నలుగురు అర్హత సాధించడం విశేషం.

ఇన్‌సర్వీస్ టీచర్ల పరిస్థితి & త్వరలో ‘ప్రత్యేక టెట్’
పరీక్షకు హాజరైన వారిలో 23,623 మంది ఇన్‌సర్వీస్ (ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న) ఉపాధ్యాయులు ఉండగా, వారిలో ఉత్తీర్ణత శాతం 37.29% గానే నమోదైంది.

ఈ నేపథ్యంలో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం మరొక అవకాశం కల్పించనుంది:

ప్రత్యేక నోటిఫికేషన్: ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం జులై 21న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

పరీక్షల తేదీలు: ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను సెప్టెంబర్‌ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.

Also Read : దేశంలోనే సరికొత్త చరిత్ర: తెలంగాణలో ‘రైతు డిస్కం’ ఏర్పాటుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్!

ఫలితాలు చూసుకునే విధానం:

పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in లో మార్కులు, క్వాలిఫైయింగ్ స్టేటస్, ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.