
BRS vs Congress : తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య భూముల పంచాయతీ నడుస్తోంది. 22ఏ, ప్యూచర్ సిటీ పేరుతో ప్రజల భూములను ఆక్రమించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించడమే కాకుండా ఆ భూముల వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిక ప్రతీగా కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్వర్ రెడ్డి ఇతర నేతలు వందల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ వారి ఫౌం హౌజ్‌లు, భూముల వద్దకు వెళ్లి అవి అక్రమ నిర్మాణాలని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ లో కీలక నేతలుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌రావులు ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలుగా మారారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వారిని టార్గెట్ చేశారు.
Also Read : కోకాపేట వేలానికి సింగిల్ బిడ్.. రద్దు చేసిన హెచ్ఎండీఏ
ఈ క్రమంలో భాగంగా సిరిసిల్ల, సిద్ధిపేటల్లో బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా తొలిసభను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీ బుధవారం సాయంత్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోఈ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, పార్టీ నాయకులు హాజరవుతారని చెబుతున్నారు.
ఇటీవల నకిరేకల్ లో నిర్వహించిన సభలో కాసుకో కల్వకుంట్ల కుటుంబమా.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సిరిసిల్లకు వస్తాను కాస్కో అంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన సిరిసిల్లలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబరు మొదటి వారంలో హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో సీఎం సభ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ నేతల నియోజక వర్గాల్లో సభలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సా్హం నింపాలని రేవంత్ రెడ్డి బావిస్తున్నార
రాష్ట్రంలో, అసెంబ్లీలో ప్రస్తుతం అక్రమ భూముల వ్యవహరం హాట్‌హాట్‌గా మారింది. ఇరు పార్టీల నేతల మధ్య సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల, సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రసంగం ఎలా ఉంటుందనే దానిపై చర్చ సాగుతోంది. ఈ సభలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆయా జిల్లా కాంగ్రెస్‌నేతలు భారీ బహిరంగసభను విజవయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో సభ విజయవంతానికి ఆయా జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.
Also Read : మాదాపూర్ ఓయో రూం లో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడిపై అనుమానం









