
BRAOU Digital : హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం అయిన డా. బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు సంబంధిత వివరాలను అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి వివరించారు. వివరాల ప్రకారం బీకామ్ (తెలుగు మీడియం), బీకామ్ (ఇంగ్లీష్ మీడియం), ఎం.కామ్ (ఇంగ్లీష్ మీడియం ), ఎం.ఏ. తెలుగు, ఎం.బి.ఏ. (ఇంగ్లీష్ మీడియం) తదితర కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. దరఖాస్తు, నమోదు, ట్యూషన్ ఫీజు చెల్లింపు తదితర వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని పుష్పా చక్రపాణి తెలిపారు.
https://digital.braou.ac.in/#programmes
Also Read : ఆకాశంలో సరికొత్త ప్రయోగం… రోదసిలో మన ఏఐ డేటా సెంటర్!
ఎన్నారైలకు అవకాశం
అలాగే దేశ, విదేశాల్లో నివసించే ఎన్నారై అభ్యర్థులు కూడా ఆన్‌లైన్ ద్వారా సంబంధిత కోర్సులలో చేరడానికి అవకాశం ఉందని ప్రొ. జి. పుష్పా చక్రపాణి పేర్కొన్నారు. అడ్మిషన్ / ట్యూషన్ ఫీజును క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇతర ఆన్‌లైన్ చెల్లింపు విధానాల ద్వారా చెల్లించవచ్చని ఆమె వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in లేదా www.braou.ac.in, లేదా విశ్వవిద్యాలయ టోల్‌ఫ్రీ నెం. 18005990101 లేదా 040-23680222 / 333/ 555 లో సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
Also Read : ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల









