
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) కన్నుమూశారు. హనుమకొండకు చెందిన ఈ యువకుడు జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ, ఎదుగుదల లోపించి చాలా రోజుల నుంచి మంచానికే పరిమితమయ్యాడు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ తుదిశ్వాస విడిచాడు.
Also Read : పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేష్ వెన్నుపోటు.. వైరలవుతున్న ఫోటో..!
గత నెలలోనే నిరంజన్ పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ స్వయంగా అతడిని కలిసి పరామర్శించారు. నిరంజన్‌ను ఆత్మీయంగా హత్తుకుని, ధైర్యం చెబుతూ సెల్ఫీ కూడా దిగారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ఆ సమయంలో తనకు కుక్కపిల్ల అంటే ఇష్టం అని నిరంజన్ చెప్పడంతో పవన్ వెంటనే ఒక కుక్కపిల్లను కొని పంపించారు. అంతేకాదు పవన్ కల్యాణ్ నిరంజన్‌తో ముచ్చటిస్తూ.. “మనం కలిసి ‘OG 2’ సినిమా చూద్దాం. ఆ సినిమాకు నువ్వే నా స్పెషల్ గెస్ట్” అని మాట ఇచ్చారు. పవన్‌తో కలిసి సినిమా చూడాలనే ఆశతో ఎదురుచూసిన ఆ చిన్నారి అభిమాని, అంతలోనే శాశ్వతంగా కన్నుమూశాడు.
Also Read : తుని పాప జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. సీసీటీవీలో కనిపించిన కారుపై!









