
AIG : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ రావు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్లోని ఓ జిమ్లో వర్కౌట్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో హిమాన్ష్ ముక్కుకు గట్టిగా గాయమైంది.
ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు హిమాన్ష్కు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని హిమాన్ష్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్సను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హిమాన్ష్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని సమాచారం.









