
Liquor Shops Closed : గడచిన పది రోజులుగా దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలోనూ ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు జరుగుతున్నాయి. కాగా, ఈ రోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో నిమజ్జనం నిర్వహించనుండగా, హైదరాబాద్లో శుక్రవారం నిమజ్జన కార్యక్రమం ఉండనుంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా మద్యం విక్రయాలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. గణేశ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి గాను మూడు రోజుల పాటు మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు గణేశ నిమజ్జన శోభాయాత్రలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు పోలీసు విభాగం ప్రకటించింది.నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గణేష్ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు రాష్ర్టంలోని అన్ని వైన్ షాపులు, బార్లు, క్లబ్లను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిమజ్జనం జరగనున్న తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఈ రోజు (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి రేపు (గురువారం) ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు ప్రకటించారు.కాగా, నిమజ్జనం సాఫిగా సాగడం కోసం నిజామాబాద్లో మంగళవారం నుంచే వైన్ షాపులు క్లోజ్ చేశారు.
Also Read : మాదాపూర్ ఓయో రూం లో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడిపై అనుమానం
నగరంలో శుక్రవారం
ఇక హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కారణంగా హైదరాబాద్ పరిధిలో శుక్రవారం వైన్ షాపులు బంద్ చేస్తారు. అలాగే మద్యం మత్తులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. గణేశ్ విగ్రహాల తుది నిమజ్జనాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 25న మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయాల్సి ఆదేశించారు. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : కోకాపేట వేలానికి సింగిల్ బిడ్.. రద్దు చేసిన హెచ్ఎండీఏ









