Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రి ఘటనపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కవిత(Kalvakuntla Kavitha) తీవ్రంగా స్పందించారు. హెల్త్ బిల్లులు విడుదల చేయడానికి సర్కార్‌కి నెల రోజుల గడువు ఇస్తున్నామన్నారు. ఆ తర్వాత తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏసీ పేలి 5 గురు చిన్నారులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్‍లో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారుల తల్లిదండ్రులను ఇవాళ కవిత పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆదిలాబాద్ రిమ్స్ లో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్, ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మరణించారని తీవ్రంగా విమర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానన్న చెప్పిన ముఖ్యమంత్రి… మీరు దత్తత తీసుకున్న జిల్లాలో ఐదుగురు పసి పిల్లలు చనిపోతే వచ్చి చూసేందుకు తీరక లేదా? అంటూ తీవ్రంగా విమర్శించారు. ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం ఉంటోంది కానీ మైనార్టీ, ఆదివాసీ పిల్లలు చనిపోతే చూసే టైమ్ కూడా లేదని కవిత నిలదీశారు.

Also Read : ప్యారడైజ్‌ కు బిగ్ షాక్‌… టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నెల రోజుల మాత్రమే గడువు….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక నెల రోజులు సమయం ఇస్తున్నామని ఆలోపు పెండింగ్‍లో ఉన్న హెల్త్ బిల్స్ రిలీజ్ చేయాలని కవిత డిమాండ్‌ చేశారు. ఆదివాసీ గూడెలకు రోడ్లు వేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో లెక్కలు బయటపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. తాము విధించిన గడువు లోపు ఆసుపత్రికి నిధులు విడుదల కాకపోయినా, రోడ్లు బాగుచేయలేకపోయినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆదివాసీలందరితో కలిసి ఘెరావ్ చేస్తామని కవిత హెచ్చరించారు. తమది ఆశామాషీగా వచ్చి చూసి వెళ్లే టూరిస్ట్ పార్టీ కాదని కవిత ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగం మంది స్టాఫ్, డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది కూడా లేరని ఆరోపించారు. కనీసం చీపుర్లు, ఫినాయిల్, దూది, మందులు కొనుగోలు చేయడానికి కూడా మెయింటెనెన్స్ బడ్జెట్ లేదని విమర్షించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.500 కోట్లు ఉన్నాయంటే ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని స్పష్టం చేశారు. ఏసీ పేలి ఇంత ఘోరం జరిగింది. కానీ ఈ ఆసుపత్రిలో 150 ఏసీలు ఉంటే ఒక్క మెకానిక్ కూడా లేరని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేశారు.

Also Read : మాదాపూర్‌ ఓయో రూం లో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడిపై అనుమానం

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.