
CM Revanth Reddy: హైడ్రాపై తెలంగాణ తాజాగా చేసిన కామెంట్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో హైడ్రా నిర్వహణపై వస్తున్న విమర్శలు, న్యాయపరమైన పరిణామాలపై ఆయన ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెరువులు, కుంటలు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడడమే లక్ష్యంగా హైడ్రా నిరంతరం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా చేస్తున్న ఈ మంచి పనులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Also Read : అమెరికాలో తీవ్ర విషాదం… తెలంగాణ మహిళ మృతి!
భూములు కబ్జా చేసిన వారే హైడ్రాపై కోర్టు ధిక్కరణ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. కొందరు తప్పుడు డాక్యుమెంట్లతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి కేసులు వేస్తున్నారని, వాటిని కోర్టుల్లో సమర్థవంతంగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాళ్లను ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఇక అధికారుల నియామకంపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వంలో ఏ అధికారిని ఎక్కడ నియమించాలన్నది పూర్తిగా ప్రభుత్వ విచక్షణ, నిర్ణయం అని సీఎం స్పష్టంచేశారు. ఇదే అంశంపై గత ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై ఏకంగా 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని, ఆనాడు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.
హైడ్రా దూకుడును అడ్డుకోవాలని చూసినా, ఎలాంటి అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసేది లేదని, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపే చర్యలు మరింత పకడ్బందీగా కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నేతలు హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది తగదని సీఎం రేవంత్ తెలిపారు. హైడ్రాను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
Also Read : యశోధ ఆసుపత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డికి పరామర్శ









