
Uppal Balu : వికారాబాద్‌లోని అనంతగిరి ఘాట్ రోడ్డుపై సోషల్ మీడియా స్టార్ ఉప్పల్ బాలు చేసిన ప్రమాదకర విన్యాసాలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఒక థార్ కారుపై కూర్చొని ఆయన చేసిన స్టంట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను ఉప్పల్ బాలు స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!
అనంతగిరి రోడ్ల పై ఉప్పల్ బాలు స్టంట్స్.. పర్యాటకులు సిరియస్.
వికారాబాద్‌లోని ప్రసిద్ధ అనంతగిరి ఘాట్ రోడ్డుపై ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ ఉప్పల్ బాలు చేసిన స్టంట్ వీడియోలు వైరల్‌గా మారాయి.
ఉప్పల్ బాలు తీరు పై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది… pic.twitter.com/sHFt7TZjkp
— Telugu Reporter (@TeluguReporter_) June 27, 2026
ఈ ప్రమాదకర చేష్టలపై స్థానికులు, పర్యాటకులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు, ప్రకృతి ప్రేమికులు సందర్శించే ఈ పవిత్రమైన కొండల ప్రాంతంలో రీల్స్ కోసం ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడటం ఎంతమాత్రం తగదని మండిపడుతున్నారు. ఈ వింత చేష్టల వల్ల అప్రతిష్ట పాలు కావడమే కాకుండా, ఘాట్ రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఉప్పల్ బాలుపై కేసు నమోదు చేశారు. ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, ప్రమాదకరంగా విన్యాసాలు చేసినందుకు గానూ బాలు మరియు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : మత సామరస్యానికి ప్రతీక ‘పీర్ల పండుగ’… త్యాగాల స్మరణలో మొహర్రం…చారిత్రక నేపథ్యం ఏంటంటే?









