addanki

తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, డాక్టర్ బల్మూరి వెంకట్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హోదాను కల్పిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వీరిద్దరికీ రాష్ట్ర మంత్రి స్థాయి హోదాను వర్తింపజేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

Also Read : షాకింగ్ : తెలంగాణలో తగ్గుతున్న ఆడపిల్లలు.. వెయ్యికి 910 మందే!

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, వీరిద్దరూ ప్రభుత్వ విప్‌లుగా పదవిలో కొనసాగే పూర్తి కాలం పాటు ఈ మంత్రి స్థాయి హోదా అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్ర వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ నిబంధనల ప్రకారం, ఆర్టికల్ 18 కింద ఈ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ హోదా కల్పించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులు వీరికి తగిన ప్రోటోకాల్, మర్యాదలను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

కాగా బల్మూరి వెంకట్ 2024 జనవరి 31న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అద్దంకి దయాకర్ 2025 ఏప్రిల్ 7న శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : మరో అవినీతి అనకొండ పట్టివేత..హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల అక్రమ ఆస్తులు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.