shah

Prithvi Shaw :  టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అతనికి కాబోయే భార్య , నటి ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన జీవితంలో చాలాసార్లు మోసపోయానని, ఒక అడుగు ముందుకు వేశాక కూడా ఇలా జరుగుతుందని నమ్మలేకపోతున్నానని ఆమె ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. “నన్ను చాలాసార్లు మోసం చేశారు, అయినా నేను ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనలేదు. జీవితంలో ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత కూడా ఇలా జరుగుతుందని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను” అని రాశారు. అంతేకాదు, “ప్రతీ రూమర్ నిజమే.. అతని గురించి మీరు సోషల్ మీడియాలో చూస్తున్నదంతా నిజమే” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఆకృతి ఈ పోస్ట్‌లో ఎక్కడా పృథ్వీ షా పేరును నేరుగా చెప్పలేదు. కానీ, ఈ ఏడాది మార్చిలోనే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరగడంతో, ఈ పోస్ట్ పృథ్వీ షాను ఉద్దేశించే పెట్టిందని అభిమానులు గట్టిగా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ను ఆమె డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, విడాకులు లేదా బ్రేకప్ రూమర్స్ వస్తున్నప్పటికీ ఆకృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పృథ్వీ షాను అన్‌ఫాలో చేయలేదు, అలాగే వారి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను కూడా డిలీట్ చేయలేదు.

Also Read : పాక్ టెస్ట్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ అజామ్.. షాన్ మసూద్‌పై వేటు!

నటిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న ఆకృతి అగర్వాల్, పృథ్వీ షా చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది మార్చిలోనే వీరిద్దరూ గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. గతంలో వీరిద్దరూ చాలాసార్లు కలిసి కనిపించారు.

ఇక క్రికెట్ విషయానికి వస్తే, అండర్-19 వరల్డ్ కప్ గెలిపించిన మాజీ కెప్టెన్ పృథ్వీ షా కెరీర్ ప్రస్తుతం అంత బాగాలేదు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నప్పటికీ అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేకపోవడంతో అతను టీమిండియాకు దూరమయ్యాడు. అయితే మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడం కోసం తాను మునుపటి కంటే మూడు రెట్లు ఎక్కువగా కష్టపడుతున్నానని, మానసికంగా బలంగా మారడానికి గత ఏడాది కాలంగా తీసుకున్న బ్రేక్ తనకు ఎంతో ఉపయోగపడిందని పృథ్వీ షా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి సమయంలో అతని పర్సనల్ లైఫ్‌లో ఈ గొడవలు జరగడం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Fifa World Cup 2026: చరిత్ర సృష్టించిన ఆఫ్రికా దేశాలు.. ఫిఫా ప్రపంచ కప్‌ నాకౌట్‌ జట్లు ఇవే..!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.