GOVT JOBS
GOVT JOBS

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఒకేసారి భారీ నోటిఫికేషన్ రిలీజైంది. దేశంలోని నాలుగు కీలకమైన విభాగాల్లో మొత్తం 7,390 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పదో తరగతి, ఐటీఐ వంటి ప్రాథమిక విద్యార్హతల నుంచి ఉన్నత విద్యనభ్యసించిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు ప్రతి ఒక్కరికీ ఈ నియామకాల్లో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా.. ఉద్యోగాన్ని బట్టి భారీ వేతనాలు కూడా పొందొచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రైల్వేలో పోస్టులు :

మొత్తం 7,390 పోస్టులలో అత్యధికంగా 4,652 పోస్టులు నార్తర్న్ రైల్వే పరిధిలోనే ఉన్నాయి. ఇవన్నీ అప్రెంటిస్ విభాగానికి చెందినవి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలవారి స్టైపెండ్ చెల్లిస్తారు. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 11తో ముగుస్తుంది. పూర్తి వివరాల కోసం rrcnr.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ASRB):

అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కూడా పలు పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపు 1,393 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, BFSc, బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి.. 30 ఏళ్ల లోపు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఎంపికైతే నెలకు రూ.29,200 నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లిస్తారు. నవంబర్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు asrb.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB):

ఇందులో జూనియర్ ఇంజనీర్ (JE) సహా వివిధ విభాగాల్లో క్లరికల్, ఇతర సాంకేతిక, సాంకేతికేతర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 1260 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్‌, ఐటీఐ లేదా సంబంధిత సాంకేతిక అర్హతలతో పాటు 32 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. పోస్టును బట్టి నెలకు రూ. 8వేల నుంచి రూ. 1,51,100 వరకు వేతనం వస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 11న ముగుస్తుంది. అభ్యర్థులు dsssb.delhi.gov.in సైట్‌ను సందర్శించాలి.

జామియా మిలియా ఇస్లామియా (Jamia Millia Islamia):

దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలలో ఒకటైన జామియా మిలియాలో 85 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. 40 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 18వేల నుంచి రూ.2,15,900 వరకు వేతనం లభిస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు డిసెంబర్ 11తో ముగుస్తుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం jmi.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.